KTR: అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు.. ఎన్టీఆర్, చంద్రబాబు కూడా అదే చేశారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
అలాంటి రాజకీయ మరుగుజ్జులతో కేసీఆర్ ను పోల్చడమే తప్పు.

KTR: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీని నడిపే అధ్యక్షుడు కేసీఆర్ ఎందుకు కనిపించడం లేదు? కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు హాజరు కావడం లేదు? ఎందుకు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు? 10టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిన సమాధానం ఏంటి? ”పాతికేళ్ల గులాబీ”..
”అలాంటి రాజకీయ మరుగుజ్జులతో కేసీఆర్ ను పోల్చడమే తప్పు. రేవంత్ రెడ్డి పేరుకే ముఖ్యమంత్రి. ఆయనను ఎవరైనా సీఎంలా చూస్తున్నారా? ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు చూస్తున్నారా? సొంత మంత్రులు చూస్తున్నారా? రాజకీయాల్లో పదవులతో ప్రతిష్ట రాదు. పర్సనాలిటీ, క్యారెక్టర్ తో వస్తుంది.
కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ అవసరం లేదు. కేసీఆర్ తయారు చేసిన సైనికులం మేమే వారికి ఎక్కువ. కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు. ఆయనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు.
దేశ రాజకీయాల్లో కొన్ని సందర్భాలు వచ్చాయి. నాడు.. ఎన్టీ రామారావు.. నేను ఐదేళ్లు అసెంబ్లీకి రాను అని అవెళ్లిపోయారు. కరుణానిధి, జయలలిత అదే చేశారు. పోయిన టర్మ్ లో పొరుగు రాష్ట్రం ఏపీలో చంద్రబాబు కూడా నేను అసెంబ్లీకి రాను అనే పరిస్థితి వచ్చింది. రాజకీయాలు అలా అరాచకంగా తయారయ్యాయి. బజారు భాష మాట్లాడే ఇలాంటి ప్రభుత్వ అధినేతలు ఉన్నప్పుడు కచ్చితంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని తెలంగాణ సమాజం కూడా ఆమోదిస్తుంది. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా మమ్మల్ని నడిపిస్తున్న శక్తి ఆయనే. పార్టీని నడిపిస్తున్నది ఆయనే.
Also Read: టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చడానికి ప్రధాన కారణం ఏంటి? పేరు మార్చినందుకే ఓడిపోయారా?
బజారు భాష మాట్లాడే సభకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని నా స్థిర అభిప్రాయం. ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడే బజారు భాష తెలంగాణ బాపు లాంటి కేసీఆర్ అక్కడ ఉండి అవమానం పాలు కావాలని నిజమైన ఏ తెలంగాణ బిడ్డ కోరుకోడు. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావాలి? ఆయన నియోజకవర్గంలో ఆయన ఉన్నారు” అని కేటీఆర్ అన్నారు.