KTR: టీఆర్ఎస్‌ పేరును బీఆర్ఎస్‌గా మార్చడానికి ప్రధాన కారణం ఏంటి? పేరు మార్చినందుకే ఓడిపోయారా?

దానికి తాత్కాలికంగా ఒక స్పీడ్ బ్రేకర్ లాగా అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాం.

KTR: టీఆర్ఎస్‌ పేరును బీఆర్ఎస్‌గా మార్చడానికి ప్రధాన కారణం ఏంటి? పేరు మార్చినందుకే ఓడిపోయారా?

Updated On : April 22, 2025 / 8:48 PM IST

KTR : టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా ఎందుకు మారింది? కారణం ఏంటి? పేరు మార్పే ఓటమికి కారణమైందా? 10టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్యూలో మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిన ఆసక్తికర సమాధానం ఏంటి.. పాతికేళ్ల గులాబీ.. స్పెషల్ ఇంటర్వ్యూ..

”అధికారం అజెండాగా ఎప్పుడూ పెట్టుకోలేదు. రాష్ట్రం సాధించడమే లక్ష్యంగా పురోగమించిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అజెండాతో పార్టీ పుట్టింది. రాష్ట్ర ఏర్పాటుతో ఆ అజెండా అయిపోయింది. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాం. మనం తెలంగాణలో చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు, మనం ఎందుకు ఇతర రాష్ట్రాలకు విస్తరించకూడదు. ఆ ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్నాం తప్ప మరొకటి కాదు.

Also Read: జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడి కలకలం.. ఆర్మీ డ్రస్‌లో వచ్చి టూరిస్టులపై టెర్రరిస్టుల కాల్పులు.. 25మందికి పైగా మృతి

మారింది పేరు మాత్రమే, మా జెండా మారలేదు, మా అజెండా మారలేదు, మా నాయకుడు మారలేదు, మా సిద్ధాంతం మారలేదు, మా ఎన్నికల సింబల్ కూడా మారలేదు. జాతీయ పార్టీగా ఎదగాలి, విస్తరించాలి అనే అజెండాతో వెళ్లాం. మహారాష్ట్రతో ప్రస్థానం మొదలు పెట్టాలని అనుకున్నాం. దానికి తాత్కాలికంగా ఒక స్పీడ్ బ్రేకర్ లాగా అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాం. 4 లక్షలే తేడా. 37శాతం ఓటు వచ్చింది. మాకు జరిగింది దారుణమైన పరాభవం కాదు. మేము 39 సీట్లు గెలిచాం. ఈ స్పీడ్ బ్రేకర్ ను అధిగమిస్తాం. తెలంగాణలో తిరిగి అధికారంలోకి వస్తాం.

”37శాతం మంది మాకు ఓటు వేశారు. వారికి తెలివి లేదంటారా? పేరులో ఏముంటుంది? సాంకేతికంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ మహారాష్ట్రలో పోటీ చేస్తే స్వీకరించరు. తెలంగాణ పార్టీ అనే అంటారు. అలా కాకుండా భారత రాష్ట్ర సమితి అని పేరు పెడితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోటీ చేసేందుకు వెసులుబాటు ఉంటుందని అలా పెట్టుకున్నాం. అదో పెద్ద ఇష్యూ కాదు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌవరం అది మా అజెండాలో ఆనాడూ ఉంది, ఈనాడూ ఉంది, రేపు కూడా ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. టీఆర్ఎస్, బీఆర్ఎస్ అని మీరు అంటున్నారు. ఊర్లలో మమ్మల్ని తెలంగాణ పార్టీ అని అంటారు” అని కేటీఆర్ అన్నారు.