Four Years Boy: బిందెలో తలపెట్టిన బాలుడు

చిన్న పిల్లలు ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటారు. కొందరైతే తల్లిదండ్రుల కళ్లుకప్పి రోడ్లపైకి పరుగులు తీస్తారు. వీరు చేసే పనుల్లో కొన్ని ఆనందం తెప్పిస్తే మరికొన్ని చిరాకు తెప్పిస్తాయి. ఒక్కోసారి కొందరు పిల్లలు తెలిసీతెలియక ప్రమాదాల బారినపడుతుంటారు.

Four Years Boy: బిందెలో తలపెట్టిన బాలుడు

Four Years Boy

Updated On : May 13, 2021 / 12:30 PM IST

Four Years Boy: చిన్న పిల్లలు ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటారు. కొందరైతే తల్లిదండ్రుల కళ్లుకప్పి రోడ్లపైకి పరుగులు తీస్తారు. వీరు చేసే పనుల్లో కొన్ని ఆనందం తెప్పిస్తే మరికొన్ని చిరాకు తెప్పిస్తాయి. ఒక్కోసారి కొందరు పిల్లలు తెలిసీతెలియక ప్రమాదాల బారినపడుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఇటువంటిదే.

నాలుగేళ్ళ బాలుడు బిందెలో తల పెట్టాడు. తల బిందెలో ఇరుక్కుపోవడంతో దానిని తీసేందుకు తల్లిదండ్రులు తీవ్రంగా ప్రయత్నించారు. ఎంతకు రాకపోవడంతో గ్రామంలోని వడ్రంగి ఇంటికి వెళ్లి కట్టర్ తో బిందెను కట్ చేసి తలను బయటకు తీశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేశవపట్నం గ్రామంలో చోటుచేసుకుంది. బాలుడికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.