Central Govt : తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతికి అపార అవకాశాలున్నాయని చెప్పారు. ఎగుమతిదారులు గతేడాది కూడా భారీగా ఎగుమతులు చేశారని గుర్తు చేశారు.

Central Govt : తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Piyush Goyal

Updated On : March 23, 2022 / 6:43 PM IST

central government green signal : తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధాన్యం ఉత్పత్తి పెరగడంతో ఎగుమతికి అవకాశం ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతికి అపార అవకాశాలున్నాయని చెప్పారు. ఎగుమతిదారులు గతేడాది కూడా భారీగా ఎగుమతులు చేశారని గుర్తు చేశారు. అయితే తెలంగాణలో ధాన్యం సేకరణపై నేరుగా స్పందించేందుకు నిరాకరించారు.

తెలంగాణలో పండిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయిపోయింది. ఏప్రిల్ 2 వరకు వేచి చూడాలని.. సానుకూలంగా స్పందించకపోతే.. ఉద్యమాలు చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Paddy Purchase : యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం క్లారిటీ

అందులో భాగంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలవడానికి తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు, ఎంపీలు ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్ మెంట్ కోరారు. గురువారం(మార్చి 24,2022) వారు మంత్రిని కలువాలనుకున్నారు. యాసంగి ధాన్యం మొత్తం కొనాలంటూ తెలంగాణ మంత్రులు ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే.