High Court Deadline : 45 నిమిషాల్లో నైట్ కర్ఫ్యూపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలి : హైకోర్టు
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ డెడ్‌లైన్ విధించింది. 45 నిమిషాల్లో నైట్ కర్ఫ్యూపై ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని ఆదేశించింది.

High Court Deadline
Telangana government : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ డెడ్‌లైన్ విధించింది. 45 నిమిషాల్లో నైట్ కర్ఫ్యూపై ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని ఆదేశించింది. అయితే నైట్ కర్ఫ్యూపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏజీ తెలిపింది. ప్రభుత్వం ఎందుకంత నిర్లక్ష్యంగా ఉందని హైకోర్ట్ సీరియస్ అయింది. 24 గంటల సమయం ఇచ్చినా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే మేమే ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది.