Sadhguru: భూమి ఎడారి అవుతుంది.. కాపాడుకోకపోతే మనుగడ సాగించలేం

భూమి ఎడారి అవుతుంది, కాపాడుకోకపోతే భవిష్యత్తులో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటూ సద్గురు జగ్గీ వాసుదేవ (Sadhguru Jagadish Vasudev) అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఏటా సుమారు 27వేల జీవ జాతులు అంతరించిపోతున్నాయని తెలిపారు.

Sadhguru: భూమి ఎడారి అవుతుంది.. కాపాడుకోకపోతే మనుగడ సాగించలేం

Sadguru

Updated On : June 15, 2022 / 7:13 PM IST

Sadhguru: భూమి ఎడారి అవుతుంది, కాపాడుకోకపోతే భవిష్యత్తులో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటూ సద్గురు జగ్గీ వాసుదేవ (Sadhguru Jagadish Vasudev) అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఏటా సుమారు 27వేల జీవ జాతులు అంతరించిపోతున్నాయని తెలిపారు. సారవంతమైన భూమిలో కనీసం 3నుంచి 6శాతం సేంద్రియ పదార్థం ఉండాలి. కానీ.. భారత్ లోని భూముల్లో సుమారు 0.65శాతం మాత్రమే సేంద్రియ పదార్థం ఉంది. మట్టిని కాపాడటం గురించి మన పిల్లలకు చెప్పడంకంటే ముందు మనం ఆచరించి చూపాలంటూ సద్గురు పేర్కొన్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో సేవ్ సాయిల్ (మట్టిని రక్షించు) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Basara IIIT Students: రెండో దశ చర్చలు విఫలం.. సీఎం కేసీఆర్ రావాల్సిందేనంటూ విద్యార్థుల డిమాండ్..

పర్యావరణంలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ, భూమిని కాపాడుకోవడం ప్రస్తుతం మన ముందున్న అత్యంత ముఖ్యమైన అంశం అన్నారు. భూమిని ఇప్పుడు కాపాడుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గత 30 ఏళ్లుగా భూమిని కాపాడుకోవడం పై నేను ఉద్యమిస్తున్నానని సుద్గురు జగ్గీ వాసుదేవ తెలిపారు. కానీ ఈ అంశంపై ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, భూమి ఎడారి అవుతుందని అందరికీ తెలుసు, దానికి పరిష్కారం కూడా అందరి దగ్గర ఉంది.. కానీ ఎవరు పాటించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Unemployment: దేశంలో తగ్గిన నిరుద్యోగిత రేటు.. పీఎల్ఎఫ్ సర్వే ఏం చెప్పిందంటే..

ఇదే పరిస్థితి ఉంటే 2045 నాటికి ప్రజలకు కావాల్సిన ఆహార ఉత్పత్తి లేక ప్రపంచం కటకటలాడుతుందని పేర్కొన్నారు. జనవరిలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ జరిగినా భూమిని కాపాడుకోవాల్సిన అవసరం పై ఎవరు చర్చించలేదని అన్నారు. భూమిని కాపాడుకునేందుకు వేసవిలోనూ భూమిని కప్పి ఉంచే పంటలు సాగు చేయాలని తెలిపారు. భూమిని కాపాడుకోకపోతే భవిష్యత్తులో 3మిలియన్ల ప్రజలు మృతి చెందే ప్రమాదం ఉందని సద్గురు హెచ్చరించారు. భూమిని కాపాడుకునేందుకు వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.