Unemployment: దేశంలో తగ్గిన నిరుద్యోగిత రేటు.. పీఎల్ఎఫ్ సర్వే ఏం చెప్పిందంటే..

దేశంలో నిరుద్యోగిత రేటు తగ్గింది. జూలై 2020 నుంచి జూన్ 2021లో నిరుద్యోగిత రేటు 4.2శాతానికి పడిపోయింది. ఇందుకు సంబంధించిన గణాంకాలను పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) నివేదిక పేర్కొంది.

Unemployment: దేశంలో తగ్గిన నిరుద్యోగిత రేటు.. పీఎల్ఎఫ్ సర్వే ఏం చెప్పిందంటే..

Unemployment

Unemployment: దేశంలో నిరుద్యోగిత రేటు తగ్గింది. జూలై 2020 నుంచి జూన్ 2021లో నిరుద్యోగిత రేటు 4.2శాతానికి పడిపోయింది. ఇందుకు సంబంధించిన గణాంకాలను పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) నివేదిక పేర్కొంది. 2017-18 సంవత్సరంలో నిరుద్యోగిత రేటు 6.1శాతం కాగా, 2018-19లో కాస్తతగ్గి 5.8శాతంగా నమోదైంది. తాజాగా PLFS వార్షిక నివేదిక (జూలై 2020 నుండి జూన్ 2021వరకు) ప్రకారం.. అన్ని వయస్సుల వ్యక్తుల్లో సర్వే నిర్వహించగా నిరుద్యోగిత రేటు 4.2శాతానికి తగ్గింది. అయితే ఈ సంఖ్య ఏడాది క్రితం (2019-20) 4.8 శాతంగా ఉంది.

Unemployment: దేశంలో పెరిగిన నిరుద్యోగిత రేటు: అత్యధికంగా హర్యానా, రాజస్థాన్

2020-21వరకు నాలుగు సంవత్సరాలలో దేశంలో నిరుద్యోగిత రేటు క్రమంగా తగ్గుముఖం పట్టిందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే పురుషుల్లో నిరుద్యోగిత రేటు 2017-18లో 6.2 శాతంకాగా, 2018-19లో ఆరు శాతం, 2019-20లో 5.1శాతం, 2020-21లో 4.5శాతానికి తగ్గింది. మహిళలల్లో నిరుద్యోగిత రేటు 2017-18లో 5.7శాతం ఉండగా, 2018-19లో 5.2శాతం, 2019-20లో 4.2శాతం, 2020-21లో 3.5 శాతానికి తగ్గినట్లు సర్వే నివేదిక పేర్కొంది. దీంతో వర్కర్ పాపులేషన్ రేషియో (WPR) కూడా మెరుగుపడింది. WPR గణాంకాలను పరిశీలిస్తే.. 2017-18లో 34.7 శాతంకాగా, 2018-19లో 35.3శాతం, 2019-20లో 38.2శాతం, 2020-21లో 39.8 శాతానికి మెరుగుపడింది.

Asaduddin Owaisi : మ‌మ‌తాబెన‌ర్జీ స‌మావేశానికి నాకు ఆహ్వానం లేదు.. ఒకవేళ ఆహ్వానించినా..

స్త్రీలలో WPR కూడా 2019-20లో 21.8 శాతం నుండి 2020-21లో 24.2 శాతానికి మెరుగుపడింది. పురుషులలో WPR కూడా 2019-20లో 53.9 శాతం నుండి 54.9 శాతానికి పెరిగింది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ (LFPR) కూడా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. LFPR అనేది పని చేయడం, పనికోసం వెతికే వారి శాతాన్ని తెలుపుతుంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 2019-20లో 40.1 శాతం నుండి 2020-21లో 41.6 శాతానికి పెరిగినట్లు పీఎల్ఎఫ్ఎస్ నివేదికలో పేర్కొంది.