బైక్ పై తీసుకెళ్తున్న ఏసీ కంప్రెషర్ పేలి వ్యక్తి మృతి

మహాశివరాత్రి పర్వదినాన విషాదం నెలకొంది. సికింద్రాబాద్‌లో బైక్‌పై తీసుకెళ్తున్న ఏసీ కంప్రెషర్‌ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు.

బైక్ పై తీసుకెళ్తున్న ఏసీ కంప్రెషర్ పేలి వ్యక్తి మృతి

Updated On : March 11, 2021 / 2:32 PM IST

AC compressor exploded and one died : మహాశివరాత్రి పర్వదినాన విషాదం నెలకొంది. సికింద్రాబాద్‌లో బైక్‌పై తీసుకెళ్తున్న ఏసీ కంప్రెషర్‌ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇద్దరు వ్యక్తులు కలిసి సర్వీసింగ్‌ చేసేందుకు ఏసీ కంప్రెషర్‌ను బైక్‌పై తీసుకెళ్తున్నారు.

ఒక్కసారి కంప్రెషర్‌ పేలిపోవడంతో వాహనం వెనకాల కూర్చున్న సలీం పాషా అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనం నడుపుతున్న మహమ్మద్‌ సమీర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.