మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని చంపిన కొడుకు

మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని చంపిన కొడుకు

Updated On : January 24, 2021 / 5:27 PM IST

The son who killed his mother in nagarkurnool : నాగర్‌కర్నూల్‌ జిల్లాలో దారుణం జరిగింది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని కడతేర్చాడో కాసాయి కొడుకు. మద్యం మత్తులో తల్లిని బండరాయితో కొట్టి చంపాడు. ఈ సంఘటన గుడిపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లికి చెందిన శుభాకర్‌ అనే వ్యక్తి కొంత కాలంగా హైదరాబాద్‌లో నివాసముంటూ కూలీ పనిచేస్తుండేవాడు. ఇటీవల సొంత గ్రామానికి వచ్చి తల్లి ఇస్తారమ్మ(55) వద్దే ఉంటున్నాడు. అయితే మద్యానికి బానిసైన శుభాకర్.. తల్లితో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు.

ఈ క్రమంలో శనివారం తల్లితో గొడవ పడి, డబ్బుల కోసం వేధించాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో రాయితో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు.