సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

Updated On : January 9, 2021 / 9:33 PM IST

Special trains for sankranthi festival : సంక్రాంతి పండుగ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. పలు మార్గాల్లో నడుపనున్న రైళ్ల వివరాలను అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్‌-బెర్హంపూర్‌కు (07449) ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు, బెర్హంపూర్‌ నుంచి సికింద్రాబాద్‌కు (07450) ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు క్లోన్‌ రైళ్లు నడుస్తాయి.

హైదరాబాద్‌-విశాఖపట్నం (07451) ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు, తిరుగుప్రయాణంలో ఇదే రైలు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ 10 నుంచి 17వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి (07453) ఈ నెల 12వ తేదీ ప్రత్యేక రైలు ఉంటుంది.

రైల్వే మరమ్మతు పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేయడంతో పాటు కొన్నింటిని రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు చెప్పారు. విజయవాడ-హుబ్లీ (07225), హుబ్లీ-విజయవాడ (07226), హుబ్లీ-హైదరాబాద్‌ (073 19), హైదరాబాద్‌-హుబ్లీ (07320) మధ్య ప్రతి రోజు నడిచే రైళ్లను 20 నుంచి 29 తేదీల మధ్య రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

నాలుగు రైళ్లను మళ్లించినట్లు రైల్యే అధికారులు తెలిపారు. కేఎస్‌ఆర్‌ బెంగుళూరు సిటీ-అజ్మీర్‌(06205), అజ్మీర్‌-కేఎస్‌ఆర్‌ బెంగుళూరు(06206), జోధ్‌పూర్‌-కేఎస్‌ఆర్‌ బెంగుళూరు సిటీ(06533), కేఎస్‌ఆర్‌ బెంగుళూరు సిటీ-జోధ్‌పూర్‌(06534) మధ్య నడిచే రైళ్లను కూసుగలి బైపాస్‌, నావలూర్‌ స్టేషన్ల మీదుగా నడుపుతామని అధికారులు తెలిపారు.