high alert : పెరుగుతున్న కరోనా కేసులు.. తెలంగాణలో హైఅలర్ట్ ?

కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. హైఅలర్ట్ ప్రకటించేందుకు సిద్ధమైంది.

high alert : పెరుగుతున్న కరోనా కేసులు.. తెలంగాణలో హైఅలర్ట్ ?

Telangana Corona

Updated On : April 6, 2021 / 5:44 PM IST

TS govt preparing to issue a high alert : కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. హైఅలర్ట్ ప్రకటించేందుకు సిద్ధమైంది. కోవిడ్‌ పేషెంట్లకు ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందుకు ఆసుపత్రులన్నీ సిద్ధంగా ఉండాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ ఆదేశించారు. కేసులు పెరుగుతున్నందున ఆయన ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో భేటీ అయ్యారు.

ఆసుపత్రుల్లో బెడ్స్‌ పెంచాలని.. 50శాతం బెడ్స్‌ను కరోనా పేషెంట్లకు కేటాయించాలని ఆదేశించారు. నాన్‌ కోవిడ్‌ కేసులు తగ్గించుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 86 క్వారంటైన్ సెంటర్లను ప్రభుత్వం ప్రారంభించిది.

తెలంగాణలో కొత్తగా 1,097 కరోనా పాజిటివ్‌లు నమోదు అయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 3,13,237కు చేరింది. మరో 6 మరణాలు నమోదయ్యాయి. దాంతో మరణాల సంఖ్య 1,723గా నమోదైంది. కొత్తగా 268 మంది కరోనాకు చికిత్సతో మొత్తంగా 3,02,768 మంది కోలుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యంలో 37,338 ప్రైవేటులో 5,732 టెస్టులు నిర్వహించారు. మొత్తం నిర్ధారణ పరీక్షల సంఖ్య 1,04,35,997కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 302 కొత్త కేసులు నమోదయ్యాయి.

మహబూబ్‌నగర్‌లో 22, ఆదిలాబాద్‌లో 24, జగిత్యాలలో 32, కామారెడ్డిలో 28, కరీంనగర్‌లో 38, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 138, నిర్మల్‌లో 42, సంగారెడ్డిలో 52, వరంగల్‌ నగర జిల్లాలో 28, నిజామాబాద్‌లో 77, రంగారెడ్డిలో 116 కేసులు నమోదయ్యాయి.