Covid-19: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. కానీ మృతి చెందిన విషయం తెలియదు
కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. 15 రోజుల వ్యవధిలో భార్య భర్తతోపాటు కుమారుడు కూడా మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా తాళ్లపేట గ్రామానికి చెందిన అక్కనపెల్లి కుమారస్వామి(70) ఆయన భార్య భూలక్ష్మీ (65), కుమారుడు రఘు (28) కి 15 రోజుల క్రితం కరోనా సోకింది. ఆరోగ్య పరిస్థితి సరిగాలేకపోవడంతో కుమారస్వామి, రఘు కరీంనగర్ లోని ఓ ఆసుపత్రిలో చేరారు.

Covid 19
Covid-19: కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. 15 రోజుల వ్యవధిలో భార్య భర్తతోపాటు కుమారుడు కూడా మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా తాళ్లపేట గ్రామానికి చెందిన అక్కనపెల్లి కుమారస్వామి(70) ఆయన భార్య భూలక్ష్మీ (65), కుమారుడు రఘు (28) కి 15 రోజుల క్రితం కరోనా సోకింది. ఆరోగ్య పరిస్థితి సరిగాలేకపోవడంతో కుమారస్వామి, రఘు కరీంనగర్ లోని ఓ ఆసుపత్రిలో చేరారు. భూలక్ష్మీ తాళ్లపేటలో హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంది.
ఆసుపత్రిలో చేరిన మూడు రోజులకే (మే 9న) రఘు మృతి చెందాడు. అయితే రఘు మృతి విషయం తల్లిదండ్రులకు తెలియదు. ఆ మరుసటిరోజే ఇంట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న తల్లి భూలక్ష్మీ మృతి చెందింది. భూలక్ష్మీ మృతి చెందిన విషయం భర్త కుమారస్వామికి తెలియదు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమారస్వామి గురువారం మృతి చెందాడు.
ఇలా ఒకే కుటుంబంలో కరోనా బారిన పడ్డ ముగ్గురు పదిహేను రోజుల్లో మృత్యువాత పడడం తాళ్లపేటలో తీవ్ర విషాదాన్ని నింపింది. కన్న కొడుకు మృతి విషయం తల్లిదండ్రులకు తెలియకపోవడం, కట్టుకున్న భార్య మృతి విషయం భర్తకు తెలియపోవడం చాలా బాధాకరమైన విషయమని గ్రామస్తులు అంటున్నారు.