Electric Shock : దేవాలయానికి మైకులు కడుతుండగా విషాదం..విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి

డోర్నకల్ మండలం అందనాలపాడులో గ్రామంలోని రామాలయానికి మైకులు కట్టేందుకు ముగ్గురు వ్యక్తులు గుడి పక్కనే ఉన్న వేప చెట్టు ఎక్కారు.

Electric Shock : దేవాలయానికి మైకులు కడుతుండగా విషాదం..విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి

Shock

Updated On : June 22, 2022 / 12:25 AM IST

electric shock : మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన డోర్నకల్ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డోర్నకల్ మండలం అందనాలపాడులో గ్రామంలోని రామాలయానికి మైకులు కట్టేందుకు ముగ్గురు వ్యక్తులు గుడి పక్కనే ఉన్న వేప చెట్టు ఎక్కారు.

Tamil Nadu : తమిళనాడులో ఆలయ రథోత్సవంలో విషాదం.. విద్యుత్ షాక్ తో 11 మంది భక్తులు మృతి

సుబ్బారావు (67) అనే వ్యక్తి మైకు కడుతుండగా ప్రమాదవశాత్తు అతనికి విద్యుత్ తీగ తగిలింది. అతడిని కాపాడే క్రమంలో మస్తాన్ రావు(57), వెంకయ్య (55) ఇద్దరికి విద్యుత్ షాక్ కొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు గుండెలవిసిలా రోధిస్తున్నారు. ముగ్గురి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.