తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ్మ రెడ్డిని హైదరాబాద్‌లో ముందస్తుగా అరెస్టు చేశారు.
Telangana Assembly: హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం, జేఏసీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. కాగా, సర్పంచ్‌లు అసెంబ్లీని ముట్టడించే అవకాశం ఉండడంతో ముందస్తుగా కూడా పలువురు మాజీ సర్పంచ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
మన హైదరాబాద్‌లో సీ-130జే విమానాల తయారీ? ఇదేగనక జరిగితే..
అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు. దాదాపు 1,000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఉంది. సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ్మ రెడ్డిని హైదరాబాద్‌లో ముందస్తుగా అరెస్టు చేశారు. ఆయనను ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
