ఆసిఫాబాద్ జిల్లా ఓపెన్ కాస్ట్ లో పులి సంచారం 

  • Published By: srihari ,Published On : May 20, 2020 / 04:49 PM IST
ఆసిఫాబాద్ జిల్లా ఓపెన్ కాస్ట్ లో పులి సంచారం 

Updated On : May 20, 2020 / 4:49 PM IST

ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం కైరీగూడలో ఓ పులి ప్రత్యక్షమయ్యింది. డీబీఎల్ ఓపెన్ కాస్ట్ లో పులి సంచరిస్తోంది. అటుగా వెళ్తున్న ఓసీపీ డ్రైవర్లు పులి కనబడటంతో భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని డీబీఎల్ ఓపెన్ కాస్ట్ లో పులి కనబడటంతో ఓసీపీ డ్రైవర్లు భయాందోళనకు గురైంది. ఓసీపీ డ్రైవర్లు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. 

కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనే కాకుండా మంచిర్యాల జిల్లా సరిహద్దుల్లో కూడా ఓ పెద్దపులి గత నెల రోజుల నుండి సంచరిస్తోంది. గత వారం రోజుల క్రితం కూడా ఈ పెద్దపులి తాడోవా అడవి ప్రాంతం నుంచి వచ్చింది. ఈ పెద్దపులి ఇక్కడే సంచరిస్తుంది.
అక్కడున్నటువంటి అటవీ శాఖ అధికారులు, పెద్దపులి సంబంధించిన అధికారులు కూడా పెద్దపులిని ట్రేస్ చేయడంలో విఫలం అయ్యారు. 

ప్రస్తుతానికి ఈ డీబీఎల్ కు సంబంధించిన ఓపెన్ కాస్ట్ కు రోజూ వందలాది మంది టూ వీలర్స్ మీద లేదా కాలినడకన కూడా పోవడం జరుగుతుంది. పులి సంచారం ఆ ప్రాంతంలో ఉండటంతో ఓపెన్ కాస్ట్ మైన్ కు సంబంధించిన డ్రైవర్లు భయాందోళనకు గురయ్యారు.