హైదరాబాద్‍లో వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో రాకపోకలు బంద్, న్యూఇయర్‌కు ట్రాఫిక్ ఆంక్షలు

డిసెంబర్ 31 రాత్రి నుంచి అర్థరాత్రి జనవరి 1 అర్థరాత్రి దాటేవరకు హుస్సేన్ సాగర్ చుట్టూ అంటే ట్యాంక్ బండ్, నెక్లస్ రోడ్డుపైన వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయి.

హైదరాబాద్‍లో వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో రాకపోకలు బంద్, న్యూఇయర్‌కు ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad Traffic Rules

Updated On : December 31, 2023 / 8:40 PM IST

Hyderabad Traffic Rules : కొత్త సంవత్సరం కదా.. ఎలా పడితే అలా ప్రవర్తించొచ్చు, సిటీ అంతా ఇష్టానుసారంగా తిరగేయొచ్చు. మనకేది అడ్డు? ఎవరేం చేస్తారులే? అని ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారా? అయితే బీకేర్ ఫుల్.. అడ్డంగా ఇరుక్కుపోతారు, ఇబ్బందుల్లో పడిపోతారు. న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు చాలానే ఉన్నాయి. ఇవి తెలియకుండా సిటీ చుట్టేదామని బయలుదేరితే అడ్డంగా బుక్కైపోవడం ఖాయం.

డిసెంబర్ 31 రాత్రి నుంచి అర్థరాత్రి జనవరి 1 అర్థరాత్రి దాటేవరకు హుస్సేన్ సాగర్ చుట్టూ అంటే ట్యాంక్ బండ్, నెక్లస్ రోడ్డుపైన వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. జనవరి 1 రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్ పై వాహనాల రాకపోకలు నిలిపివేశారు.

Also Read : దొరికితే.. 6నెలలు జైలు, రూ.10వేలు ఫైన్.. న్యూఇయర్ వేడుకలకు పోలీసుల కొత్త రూల్స్

ఖైరతాబాద్ చౌరస్తా వివి విగ్రహం నుంచి ఫ్లైఓవర్ మీదుగా నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు.. ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా ఇక్బాల్ మినార్, నిరంకారి, రాజ్ భవన్ వైపు ట్రాఫిక్ ని అస్సలు అనుమతించరు. బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే ట్రాఫిక్ ని తెలుగు తల్లి ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద.. లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్ వైపు మళ్లిస్తారు.

హిమాయత్ నగర్ లిబర్టీ నుంచి వచ్చే వాహనాల రాకపోకలను ఎగువ ట్యాంక్ బండ్ వైపు అనుమతించరు. ప్రయాణికులు తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి అంబేద్కర్ విగ్రహం వద్ద ఎడమవైపు వెళ్లాలి.

Also Read : న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసుల సరికొత్త ప్రయోగం.. ఇలా దొరికిపోతారంతే..