Telugu Academy : తెలుగు అకాడమీ నిధులు గోల్ మాల్….ఏపీ మర్కంటైల్ క్రెడిట్ సొసైటీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

తెలుగు అకాడమీ నిధులు గోల్‌మాల్‌ కేసులో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసు ఏపీ మర్కంటైల్ క్రెడిట్ సొసైటీ చుట్టూ తిరుగుతోంది. నిందితులపై మరో రెండు కేసులు నమోదయ్యాయి.

Telugu Academy : తెలుగు అకాడమీ నిధులు గోల్ మాల్….ఏపీ మర్కంటైల్ క్రెడిట్ సొసైటీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Telugu Academy Funds

Updated On : October 2, 2021 / 5:05 PM IST

AP Mercantile Credit Society Limited : తెలుగు అకాడమీలో నిధులు గోల్‌మాల్‌ కేసులో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు దూకుడు పెంచారు. ఏపీ మర్కంటైల్ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్ బండారు సుబ్బారావు అలియాస్‌ సత్యనారాయణ ఆదేశాలతోనే నిధులు మళ్లించినట్లు ఆపరేషన్స్‌ మేనేజర్‌ పద్మావతి విచారణలో ఒప్పుకోవడంతో… ఈ కేసు ఏపీ మర్కంటైల్ క్రెడిట్ సొసైటీ చుట్టూ తిరుగుతోంది. నిందితులపై సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో మరో రెండు కేసులు నమోదయ్యాయి.

ఈ కేసులో A-3గా ఏపీ మర్కంటైల్ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్ సత్యనారాయణ, A-4గా ఆపరేషన్స్‌ మేనేజర్‌ పద్మావతి, A-5 రిలేషన్స్ మేనేజర్ మోహినుద్ధిన్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. పద్మావతి, మోహినుద్దీన్‌ను ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో దర్యాప్తు చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, నిందితులు పద్మావతి, మొహినుద్దీన్‌ను కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు కోరారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేసిన పోలీసులు..ఇదే కేసులో మరికొంతమంది బ్యాంక్‌ అధికారులు, అకాడమీ ఉద్యోగులను ప్రశ్నిస్తున్నారు. మరికొందరిని ఇవాళ అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.

Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో కీలక నిందితుడు అరెస్ట్‌

అటు A1గా ఉన్న యూనియన్‌ బ్యాంక్ మేనేజర్‌ మస్తాన్‌వలీ, అతని అనుచరుడు A2గా రాజ్‌కుమార్‌తో పాటు తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీ పోలీసుల అదుపులో ఉన్నారు. మరో ముగ్గురు నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు సీసీఎస్‌ పోలీసులు. తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్‌పై ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది త్రిసభ్య కమిటీ.

తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్‌ కేసు … రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక అంశాలను పొందుపర్చారు సీసీఎస్ పోలీసులు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీకి ఇవ్వాల్సిన నిధులపై గత నెల 18న బ్యాంకు అధికారులతో తెలుగు అకాడమీ డైరక్టర్‌ సోమిరెడ్డి భేటీ అయినట్లు ప్రస్తావించారు. గత నెల 21న కార్వాన్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ నుంచి 24 కోట్లు విత్‌డ్రాకు రఫీక్‌ అనే తెలుగు అకాడమీ ఉద్యోగిని పంపితే..మేనేజర్‌ మస్తాన్‌వలీ అనుచరుడిగా రఫీక్‌తో రాజ్‌కుమార్‌ పరిచయం చేసుకున్నాడు.

Telugu Academy : తెలుగు అకాడమీలో గోల్ మాల్.. కలర్ జిరాక్స్‌లతో రూ. 64 కోట్లు మాయం

ఎఫ్‌డీఐలను తిరిగి ఇవ్వాలని రఫీక్‌ కోరాడు. అయితే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు క్లోజ్‌ చేయడానికి సమయం కోరిన యూనియన్ బ్యాంక్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీ..మూడు రోజులైనా స్పందించలేదు. దీంతో గత నెల 24 బ్యాంక్‌కు మళ్లీ రఫీక్‌కు పంపారు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి. అప్పటికే 63 కోట్ల రూపాయల ఎఫ్‌డీలన్నీ క్లోజ్‌ అయినట్లు, కార్వాన్‌ యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీ సంతోష్‌నగర్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు తెలుసుకున్నారు.

తెలుగు అకాడమీ నకిలీ లెటర్‌ హెడ్‌లు క్రియేట్‌చేసి, అకాడమీ డైరెక్టర్‌ సంతకాలు ఫోర్జరీ చేసి నిధులు మళ్లింపు జరిగినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో ఉంది. తెలుగు అకాడమీ ఖాతా నుంచి నిధులు…ఏపీ మర్కంటైల్‌ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌కు విడతలవారీగా బదలాయింపు జరిగింది. ఈ ఏడాది జనవరి 178 నుంచి సెప్టెంబర్‌ 18వరకు విడతలవారీగా నిధులు మళ్లింపు జరిగినట్లు సీసీఎస్‌ పోలీసుల విచారణలో తేలింది.