Bandi Sanjay : టీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వస్తామంటున్నారు, ఈటల మా పార్టీ నాయకుడే

దళిత బంధు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని, టీఆర్ఎస్ సంగతి చూస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు.

Bandi Sanjay : టీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వస్తామంటున్నారు, ఈటల మా పార్టీ నాయకుడే

Bandi Sanjay

Updated On : November 3, 2021 / 6:36 PM IST

Bandi Sanjay : దళిత బంధు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని, టీఆర్ఎస్ సంగతి చూస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ఈటల రాజేందర్ బీజేపీ గుర్తు మీద గెలిచాడని ఆయన చెప్పారు. ఆయన బీజేపీ నాయకుడే అని తేల్చి చెప్పారు. అక్కడక్కడా ఎవరో ఏదో మాట్లాడుతున్నారని, అవన్నీ తాము పట్టించుకోము అన్నారు.

WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. నో టైం లిమిట్.. ఎప్పుడైనా డిలీట్ చేయొచ్చు!

టీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వస్తాం అంటున్నారు అన్న బండి సంజయ్ వారు వచ్చేదాకా మేము ఎదురు చూడము అన్నారు. విజయ గర్జన ఇంకా ఎందుకో అర్థం కావడం లేదన్నారు బండి సంజయ్. ఆ సభకు స్థలం కూడా దొరకడం లేదన్నారు. సభ కోసం రైతుల భూములు తీసుకుంటే సహించము అన్నారు. గల్లీలో, ఢిల్లీలో కనుమరుగు అయిన కాంగ్రెస్ తో మాకు పొత్తా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని బండి సంజయ్ అన్నారు.