Complaint On Etala : ఈటలపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు

బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారని, ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరించారని ఆరోపించారు.

Complaint On Etala : ఈటలపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు

Etala (2)

Updated On : October 31, 2021 / 9:11 AM IST

TRS complaint on etala rajendar : బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారని, ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారని ఆరోపించారు. ఈటల దంపతులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

హుజూరాబాద్‌లో పోలింగ్‌ ముగిసింది. ఇక ఫలితమే మిగిలి ఉంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ఓటింగ్‌ నమోదైంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 84 శాతం పైగా పోలింగ్‌ నమోదవగా ఈ సారి అది 86.57 శాతానికి పెరిగింది. 2.5 శాతం పైగా పెరుగుదల నమోదైంది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌.డిగ్రీ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచారు. మంగళవారం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడవనున్నాయి.

Telugu States Bypoll : హుజూరాబాద్, బద్వేల్‌‌లో పోలింగ్ సమాప్తం

మరోవైపు హుజూరాబాద్‌ బైపోల్‌పై ఎగ్జిట్ పోల్స్‌ హీట్‌ పెంచేస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సహా 35 మంది అభ్యర్థులు హుజూరాబాద్‌ బరిలో నిలిచారు. అయితే ప్రధాన పోటీ మాత్రం టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే నెలకొంది. ఎగ్జిట్‌ పోల్స్‌లో కూడా టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని కొన్ని సర్వేలు చెబుతుంటే మరికొన్ని సర్వేలు ఈటలదే విజయమంటున్నాయి.