Modi Vs TRS: ప్రధాని మోడీ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వనున్న టీఆర్ఎస్ ఎంపీ
ప్రధాని మోడీ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు టిఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు తెలిపారు.

Kk
Modi Vs TRS: రెండు తెలుగు రాష్ట్రాల విభజన అందరి అభిప్రాయాల మేరకు జరగలేదంటూ పార్లమెంట్ లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేతలు గుర్రుమంటున్నారు. తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయంటూ బుధవారం టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభలో ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రధాని మోడీ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు టిఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు తెలిపారు. రాజ్యసభలో తలుపులు మూసి తెలంగాణ ఏర్పాటు పై నిర్ణయం తీసుకున్నారంటూ, ప్రత్యేక తెలంగాణ పోరాటాన్ని కించపరిచేలా రాజ్యసభలో మోడీ వ్యాఖ్యలు ఉన్నాయని కేకే అన్నారు.
Also read: Anna Hazare: ఫిబ్రవరి 14 నుంచి అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్ష
పార్లమెంట్ కార్యకలాపాలను, చట్ట సభను దిగజార్చేలా, పార్లమెంట్ ప్రిసైడింగ్ అధికారులను అగౌరవ పరిచేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. పార్లమెంట్ నియమనింబంధనల మేరకు ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఆమోదం పొందిందని, ప్రత్యేక తెలంగాణ తొందరపాటు నిర్ణయం కాదని కేకే పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో మోదీపై ఈ సెషన్ లో ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలా…లేక వచ్చే సెషన్ లో ఇవ్వాలా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకూ రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.
Also read: Statue of Equality: సనాతన ధర్మం మన దేశంలో ఏళ్ల తరబడి సుసంపన్నంగా ఉంది: మోహన్ భగవత్