TS MLC Elections : ఎన్నికలు లేకుండానే ఆరు చోట్ల టీఆర్ఎస్ విజయం

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 12 స్థానాల్లో ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరింటికి ఎన్నికలు జరగనున్నాయి.

TS MLC Elections : ఎన్నికలు లేకుండానే ఆరు చోట్ల టీఆర్ఎస్ విజయం

MLC Elections

Updated On : November 26, 2021 / 7:34 PM IST

TS MLC Elections :  తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 12 స్థానాల్లో ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరింటికి ఎన్నికలు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి, శంబీపూర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఉమ్మడి నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కుచికుళ్ల దామోదర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

చదవండి : MLC Election Nominations : తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్లు

ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి టీఆర్ఎస్ తరపున దండెం విఠల్ పోటీలో ఉండగా.. స్వతంత్ర అభ్యర్థిగా పుష్పరాణి బరిలో ఉన్నారు. కరీంనగర్ నుంచి టీఆర్ఎస్ తరపున ఎల్.రమణ, భానుప్రసాద్ రావు పోటీలో ఉండగా 8 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.. స్వతంత్ర అభ్యర్థుల్లో కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ సింగ్ పోటీలో ఉన్నారు.

చదవండి :  MLC Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ ఉపసంహరణ గడువు

మెదక్ జిల్లా తెరాస అభ్యర్థిగా యాదవరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మల, స్వతంత్ర అభ్యర్థిగా మల్లారెడ్డి బరిలో ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధు కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు సహా మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా నుంచి టీఆర్ఎస్ తరపున కోటిరెడ్డితోపాటు నలుగురు స్వతంత్రులు బరిలో ఉన్నారు.