Telangana High court: కరోనా ఆంక్షల అమలుపై హైకోర్టు పెదవి విరుపు, విచారణ 28కి వాయిదా

ప్రభుత్వ తరుపు వాదనలు విన్న ధర్మాసనం.. తెలంగాణలో కరోనా ఆంక్షల అమలుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసహనం వ్యక్తం చేసింది.

Telangana High court: కరోనా ఆంక్షల అమలుపై హైకోర్టు పెదవి విరుపు, విచారణ 28కి వాయిదా

Highcourt

Updated On : January 25, 2022 / 1:09 PM IST

Telangana High court: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిర్ములన, ఆంక్షల అమలు వంటి విషయాలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరుపున హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. ప్రభుత్వ తరుపు వాదనలు విన్న ధర్మాసనం.. తెలంగాణలో కరోనా ఆంక్షల అమలుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసహనం వ్యక్తం చేసింది. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అందించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉంది. గత వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు 10శాతం దాటలేదన్న డీహెచ్.. పాజిటివిటీ 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు అవసరమని గుర్తుచేశారు. ముందు జాగ్రత్తగా జనం గుమిగూడకుండా జనవరి 31 వరకు ఆంక్షలు పొడిగించిన్నట్లు డీహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Also read: Space News: భూమి నుంచి 10 లక్షల కి.మీ దూరంలో పార్కింగ్ చేసుకున్న “జేమ్స్ వెబ్” టెలీస్కోప్

రాష్ట్రంలో.. మెదక్ జిల్లాలో అత్యధికంగా 6.45, కొత్తగూడెంలో అతి తక్కువగా 1.14 శాతం పాజిటివిటీ రేటు నమోదు కాగా..జీహెచ్ఎంసీలో 4.26, మేడ్చల్ లో 4.22 శాతం పాజిటివిటీ రేటు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం కేసులు పెరిగిన నేపథ్యంలోనూ.. ఐసీయూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1శాతంగానే ఉందని శ్రీనివాసరావు నివేదించారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటి జ్వరం సర్వే కొనసాగుతుందని.. రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని డీహెచ్ పేర్కొన్నారు. లక్షణాలున్న 1.78 లక్షల మందికి కోవిడ్ కిట్లు పంపిణీ చేసినట్లు డీహెచ్ శ్రీనివాసరావు నివేదికలో పేర్కొన్నారు.

Also read: Somu Veerraju: జీతాలు ఇవ్వలేని పరిస్ధితిలో వైసీపీ ప్రభుత్వం: సోము వీర్రాజు

ఇక రాష్ట్రంలో 18 ఏళ్ల లోపు వారికి 59 శాతం వ్యాక్సినేషన్, 2.16 లక్షల మందికి ప్రికాషన్ డోసు అందించినట్లు హెల్త్ డైరెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ నివేదికపై పిటిషనర్ల తరుపు న్యాయవాదులు తమ వాదనలు హై కోర్టులో బలపరిచారు. ప్రభుత్వం తప్పుడు గణాంకాలు సమర్పిస్తోందని.. మూడు రోజుల్లో 1.70 లక్షల జ్వర బాధితులను పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వ కిట్ లో పిల్లల చికిత్సకు అవసరమైన మందులు లేవని, కోవిడ్ బాధితులకు బలవర్ధకమైన ఆహారం ఇవ్వడంలేదని న్యాయవాదులు పేర్కొన్నారు.

Also read: Srikanth Reddy: మా ప్రభుత్వంపై బురద జల్లేందుకు చంద్రబాబు రకరకాల కుట్రలు

ఇక ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం..ఆరోగ్యశాఖపై అసహనం వ్యక్తం చేసింది. మాస్కులు, భౌతిక దూరం వంటి పాక్షిక ఆంక్షలు కూడా అమలు కాకపోవడం దురదృష్టకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పరిస్థితి వివరించేందుకు డీహెచ్ శ్రీనివాసరావు తదుపరి విచారణకు హాజరు కావాలని, విచారణ జనవరి 28కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

Also read: Supreme Court: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు సీరియస్.. కేంద్రం, ఈసీకి నోటీసులు