Union Labor Department : సింగరేణి ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కేంద్ర కార్మిక శాఖ

సింగరేణి యాజమాన్యం సహకరించకపోవడంతో ముందుకు వెళ్లలేకపోతున్నామని తెలిపింది. ఇప్పటివరకు ఓటర్లు తుది జాబితాను ప్రకటించలేదని పేర్కొంది.

Union Labor Department : సింగరేణి ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కేంద్ర కార్మిక శాఖ

Singareni Elections High Court

Updated On : October 8, 2023 / 5:50 AM IST

Union Labor Department – Singareni Elections : కార్మిక సంఘం ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడం లేదని కేంద్ర కార్మిక శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయంచింది. కేంద్ర కార్మిక శాఖ తరఫున డిప్యూటి చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాసులు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 28న నిర్వహించేలా షెడ్యూల్ చేశామని కేంద్ర కార్మిక శాఖ చెప్పింది.

సింగరేణి యాజమాన్యం సహకరించకపోవడంతో ముందుకు వెళ్లలేకపోతున్నామని తెలిపింది. ఇప్పటివరకు ఓటర్లు తుది జాబితాను ప్రకటించలేదని పేర్కొంది. గత నెల(సెప్టెంబర్) 27న జరిగిన సమావేశానికి కూడా హాజరు కాలేదని వెల్లడించింది.

Indian Students : ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు

ఎన్నికలకు సహకరించాలని సింగరేణి యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్ర కార్మిక శాఖ హైకోర్టును కోరింది. సింగరేణి అప్పిల్ తో కలిపి కేంద్ర కార్మిక శాఖ పిటిషన్ పై అక్టోబర్ 13న సీజేఐ ధర్మాసనం విచారణ జరుపునుంది.