రేవంత్ గుర్తుపెట్టుకో.. నీ బిడ్డ పెళ్లికికూడా వెళ్లకుండా ఇబ్బంది పెట్టారు.. : బండి సంజయ్
కేటీఆర్ బామ్మర్ధి మీద కేసు అయితే ఎమ్మెల్యేలు అంతా పరామర్శకు వెళ్లారు. కానీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసు నమోదైతే మాత్రం వారిని పరామర్శించరు.

Bandi Sanjay
Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. రేవంత్ గుర్తుపెట్టుకో.. నీ బిడ్డ పెళ్లికి కూడా వెళ్లకుండా ఇబ్బంది పెట్టారు.. నిన్ను జైలుకు పంపించారు. జైలుకు పంపించిన వారితో కాంప్రమైజా? అంటూ బండి సంజయ్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్ – కేటీఆర్ మధ్య ఒప్పందం ఉంది కాబట్టే కేటీఆర్ ను అరెస్ట్ చేయడం లేదని సంజయ్ ఆరోపించారు.
Also Read: వాళ్లకు కేక్ కూడా నేను ఇప్పిస్తా..! సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
కలలో కూడా కేటీఆర్ కు బండి సంజయ్, రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. కేటీఆర్ – రేవంత్ కాంప్రమైజ్ అయ్యారు. అందుకే మొన్నటి జన్వాడా కేసును గాలికి వదిలేశారు. రేవంత్ తో కేటీఆర్ ములకత్ రాజకీయాలు నడిపిస్తున్నారు. తెలంగాణలో ఆక్టివ్ సీఎం కేటీఆర్ అంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటై బీజేపీని మీడియాలో లేకుండా చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ గురించి ఆలోచించే వారెవరూ లేరు. కాంగ్రెస్ ను గద్దెదింపే దమ్ము బీఆర్ఎస్ పార్టీకి లేదని సంజయ్ అన్నారు.
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ
ప్రజా సమస్యల మీద స్పందించని కేసీఆర్.. కేటీఆర్ బామ్మర్ధి అరెస్ట్ అయితే మాత్రం అధికారులకు ఫోన్ చేస్తారా..? కేటీఆర్ బామ్మర్ధి మీద కేసు అయితే ఎమ్మెల్యేలు అంతా పరామర్శకు వెళ్లారు. కానీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసు నమోదైతే మాత్రం వారిని పరామర్శించరు. అభ్యర్ధి లేడు కాబట్టే ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుందని బండి సంజయ్ అన్నారు. ఆరు గ్యారెంటీల అమలు మీద పాదయాత్ర చేయాలి.. మూసి ప్రక్షాళన పేరుతో ఇల్లు కూల్చిన చోట రేవంత్ పాదయాత్ర చేయాలంటూ సంజయ్ సూచించారు.