మీ బండారం బయటపెడతా..!- కేటీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
బీఆర్ఎస్ క్యాడర్, లీడర్లు కేటీఆర్ ను తిడుతున్నారు. ఇంకా కేటీఆర్ కు అహంకారం పోలేదని.

Bandi Sanjay (Photo Credit : Google)
Bandi Sanjay : గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య చిచ్చు రాజేసింది. మాజీ మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రి బండి సంజయ్ నడుమ మాటల తూటాలు పేలుతున్నాయి. తనను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. బండి సంజయ్ పేపర్ లీకులు చేయమంటే చేస్తారు, బండి సంజయ్ ఏమైనా చదువుకున్నారా? గ్రూప్ 1 అభ్యర్థుల సమస్యలు బండి సంజయ్ కు ఏం తెలుసు? అని కేటీఆర్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్.
కేవలం కేటీఆర్ అహంకారంతోనే బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయిందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. కేటీఆర్ లాగా సంస్కారహీనంగా తాను మాట్లాడను అని అన్నారు. కేటీఆర్, సీఎం రేవంత్ ఒక్కటే అని ఆరోపించారు బండి సంజయ్. జన్వాడ ఫామ్ హౌస్ ను ఎందుకు కూల్చలేదని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ చీకటి బతుకు నాకు తెలియదా అని నిప్పులు చెరిగారు. మమ్మల్ని ప్రభుత్వం చర్చలకు పిలవలేదన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే కాబట్టే.. డ్రగ్స్, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో చర్యలు లేవని ఆరోపించారు బండి సంజయ్.
”బీఆర్ఎస్ క్యాడర్, లీడర్లు కేటీఆర్ ను తిడుతున్నారు. ఇంకా కేటీఆర్ కు అహంకారం పోలేదని. కేటీఆర్ భాష, వ్యవహార శైలి మారలేదు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించారా? రాళ్లతో కొడతారనే భయంతోనే అభ్యర్థుల ఆందోళనలో కేటీఆర్ పాల్గొనలేదు. మీ కంటే ఎక్కువే మాట్లాడతా నేను. కానీ, నాకు సంస్కారం అడ్డు వస్తుంది. మా పార్టీ నాకు సంస్కారం నేర్పింది. అటువంటి భాష మాకు నేర్పలేదు. మీ చీకటి బతుకులు బయటపెడితే రోడ్డు మీద తిరగలేరు. మరోసారి తిక్క తిక్కగా మాట్లాడితే అది కూడా బయటపెడతా. కేటీఆర్ అహంకారం వల్లే కేసీఆర్ అధికారం కోల్పోయి రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను పేపర్ లీక్ చేశానని, నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని నీ కుటుంబంతో వచ్చి ప్రమాణం చేస్తావా?” అని కేటీఆర్ కు సవాల్ విసిరారు బండి సంజయ్.
గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలపైనా బండి సంజయ్ స్పందించారు. గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్ న్యాయమైనదే అని ఆయన అన్నారు. గ్రూప్-1 రద్దు చేయమని అడగటం లేదు. కేవలం వాయిదా వేయాలని కోరుతున్నాం అని బండి సంజయ్ స్పష్టం చేశారు. జీవో 29తో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది అనేది వాస్తవం అన్నారాయన. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని అభ్యర్థులు భయపడుతున్నారని బండి సంజయ్ అన్నారు. అభ్యర్థులపై లాఠీఛార్జ్ జరగడం బాధాకరం అన్నారు బండి సంజయ్.
బండి సంజయ్ ను ఉద్దేశించి కేటీఆర్ ఏమన్నారంటే..
”గ్రూప్-1 అభ్యర్థుల సమస్యలు బండి సంజయ్ కు ఏం తెలుసు? బండి సంజయ్ ను ముందు పెట్టి గ్రూప్ 1 అభ్యర్థుల గొంతుకోస్తున్నారు. బండి సంజయ్ పేపర్ లీకులు చేయమంటే చేస్తారు. బండి సంజయ్ కు ఏం తెలుసని చర్చలకు పిలుస్తారు. బండి సంజయ్ ఏమైనా చదువుకున్నారా?
Also Read : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్సెస్ గుత్తా.. నల్గొండ జిల్లాలో నయా వార్