Telangana : డంపింగ్ యార్డుగా ఉపయోగించి..కనీసం రహదారి లేని స్థలాన్ని ఆస్పత్రి నిర్మాణానికి ఇస్తారా? :కిషన్ రెడ్డి
ESI ఆస్పత్రి నిర్మాణం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన భూమి గతంలో డంపింగ్ యార్డుగా ఉపయోగించారని.కనీసం రహదారి కూడా లేని భూమిని ఆస్పత్రి నిర్మాణానికి కేటాయించారని కాబట్టి మరోచోట భూమిని కేటాయించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లెటర్ రాశారు.

Minister Kishan Reddy Letter To Cm Kcr..on Ramagundam Esi Hospital
Minister Kishan Reddy letter to CM KCR..on Ramagundam ESI Hospital : సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మరో లేఖ రాశారు. రామగుండంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి.. అవసరమైన 5 ఎకరాల భూమి కేటాయింపు చేయాలని లేఖ రాశారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ భూమిని కేటాయించింది. కానీ ప్రభుత్వం కేటాయించిన ఆ భూమి ఆస్పత్రి నిర్మాణానికి అనుకూలంగా లేదని నిపుణుల కమిటీ రిపోర్టు ఇచ్చిందని కాబట్టి ఆస్పత్రి నిర్మాణానికి అనువుగా ఉండే భూమిని కేటాయించాలని కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కోరారు.
ఆస్పత్రి నిర్మాణం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన భూమి గతంలో డంపింగ్ యార్డుగా ఉపయోగించారని..పైగా ఆ భూకి పక్కనే రెండు శ్మశానాలు కూడా ఉన్నాయని.. అటువంటి భూమిని ఆస్పత్రి నిర్మాణానికి కేటాయించటం సరికాదు అని అనుకూలంగా ఉండే భూమిని కేటాయించాలని వివరిస్తు కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. కేటాయించిన భూమికి సరైన రహదారి కూడా లేదని..రాకపోకలకు వీలుగా ఉండే ప్రత్యామ్నాయంగా భూమిని కేటాయించాలని కోరారు.
కాగా..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగతున్న కార్మికులకు వైద్య సేవలకు విస్తృతం చేయటానికి హైదరాబాద్ నగరంతో పాటు ఇతర తెలంగాణ జిల్లాలకు ఈఎస్ఐ వైద్య సేవలను విస్తరించాలని కేంద్రం కార్మిక శాఖ చర్యలు ప్రారంభించింది. దీంట్లో భాగంగానే రామగుండం పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో పనిచేసే వేలాది కార్మికులకు అందుబాటులో ఉండేలా 2018లోనే 100 పడకల ఆస్పత్రి నిర్మించాలని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంకల్పించింది. ఈ క్రమంలో ఆస్పత్రి నిర్మాణానికి భూమిని కేటాయించాలని కోరగా తెలంగాణ ప్రభుత్వం భూమిని కేటాయించింది. కేటాయించిన భూమి ఆస్పత్రి నిర్మాణానికి అనుకూలంగా లేదని నిపుణుల కమిటీ రిపోర్టు ఇచ్చిందని కాబట్టి ఆస్పత్రి నిర్మాణానికి అనుకూలంగా ఉండే భూమిని కేటాయించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్ కు లేఖలో వివరించారు.