Vaikuntha Ekadashi: ఉత్తర ద్వార దర్శన పూజల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలనుకుంటున్నారా?
డిసెంబరు 29న శ్రీ సీతారామచంద్ర స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజు ఉత్తర ద్వార దర్శన పూజలు ఉంటాయి.
Bhadrachalam Temple
Vaikuntha Ekadashi: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి మహోత్సవాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. డిసెంబరు 20వ తేదీ నుంచి ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ప్రారంభం అవుతాయి.
డిసెంబరు 29న శ్రీ సీతారామచంద్ర స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజు ఉత్తర ద్వార దర్శన పూజలు ఉంటాయి. ఇందులో ప్రత్యక్షంగా పాల్గొనే వారు ఆయా ఫీజులు ఉండే సెక్టార్ టికెట్లు కొనాలి. రూ.2,000, రూ.1,000, రూ.500, రూ.250 టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. (Vaikuntha Ekadashi)
bhadradritemple.telangana.gov.in నుంచి టికెట్లు పొందవచ్చు. వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్ చేసుకున్న తర్వాత డిసెంబరు 18 నుంచి 30న ఉదయం 5 గంటల వరకు రామాలయ ఆఫీసును సంప్రదించి ఒరిజినల్ టికెట్లు తీసుకోవాలి.
