Viral Video: లారీ కింద పడ్డా బతికి బయటపడ్డాడు.. మాములు అదృష్టం కాదిది..

ఈ వీడియోలో ఓ లారీ వెళ్తుంటే దాని పక్క నుంచే వెళ్లాలని చూశాడు ఓ ద్విచక్ర వాహనదారుడు. ఎక్స్ రోడ్ కావడంతో లారీ..

Viral Video: లారీ కింద పడ్డా బతికి బయటపడ్డాడు.. మాములు అదృష్టం కాదిది..

Viral Video

Viral Video – Lorry: మాములు అదృష్టం కాదు ఇది అంటూ టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ సజ్జనార్ (VC Sajjanar) తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. భారీ వాహనాల పక్క నుంచి వెళ్లటప్పుడు ద్విచక్రవాహన చోదకులు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రమాదం ఎప్పుడైనా, ఎటు నుంచైనా రావొచ్చు.. జాగ్రత్త అని పేర్కొన్నారు.

ఈ వీడియోలో ఓ లారీ వెళ్తుంటే దాని పక్క నుంచే వెళ్లాలని చూశాడు ఓ ద్విచక్ర వాహనదారుడు. ఎక్స్ రోడ్ కావడంతో లారీ ఓ వైపునకు తిప్పుకుని వెళ్లింది. అదే సమయంలో లారీ కుడి పక్క తగిలి దాని కింద పడిపోయాడు ఓ యువకుడు. ఆ తర్వాత అతడి ద్విచక్ర వాహనం లారీ కింద నలిగిపోయింది. ఆ యువకుడు కూడా లారీ కింద పడినప్పటికీ గాయాలతో బయటపడ్డాడు.

లారీ చక్రాల కింద నలిగిపోకుండా ఆ యువకుడు తప్పించుకోగలిగాడు. ఒళ్లుగగుర్పొడిచేలా ఈ వీడియో ఉంది. రోడ్డుపై వెళ్తున్న సమయంలో జాగ్రత్తలు వహించాలని, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. కుటుంబానికి శోకాన్ని మిగల్చవద్దని కోరుతున్నారు.

Chandrayaan-3: చంద్రయాన్-2 కంటే చంద్రయాన్-3 గొప్పేంటీ? రెండింటి మధ్య ఆ 5 తేడాలివే..