Vijayashanti: నాది పదవుల ప్రయాణ రాజకీయ జీవితం కాదు: విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు
బీజేపీ వ్యతిరేక మీడియా తన పైన చెబుతున్నదంతా ఊహాగాన సృష్టిత అవాస్తవం అని విజయశాంతి చెప్పుకొచ్చారు.

Vijayashanti
Vijayashanti – BJP: బీజేపీ తెలంగాణ (Telangana) నాయకురాలు విజయశాంతి తమ పార్టీ గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తనది పదవుల ప్రయాణ రాజకీయ జీవితం కాదని అన్నారు. ” దైవాన్ని విశ్వసించే అంతఃకరణ, తరాల తెలంగాణ ప్రజల కష్టాలు చూసి చలించి, ఉద్యమించే మనో ప్రేరణ.. రెండింటి సమాహారం. ఇది బహుశా తీవ్రమైన నా సంఘర్షణాభరిత 25 సంవత్సరాల రాజకీయ పయనం కావచ్చు.
అయితే, బీజేపీ అంటే, నేను విశ్వసించే అంతఃకరణ నమ్మకం, తెలంగాణ అంటే ఆ విశ్వాసం, నమ్మకాలను మించిన నా ప్రజా ప్రయాణం. కానట్లయితే, 2005ల నేను, బీజేపీని వదిలి తెలంగాణ ఉద్యమ బాట పట్టి ఉండకపోవచ్చు.
బీజేపీపై ఎన్డీఏ భాగస్వామ్య ఒత్తిడి వల్ల, నాడు ఆత్మగౌరవ తెలంగాణ ఒక్క అంశం కాకుంటే, నేను 1998 నుండి 2005 వరకూ దేశమంతా పనిచేసిన నా బీజేపీని నాడు ఎందుకు దూరం చేసుకోవాల్సి వస్తది? నేడు బీజేపీ వ్యతిరేక మీడియా నా గురించి చెబుతున్నట్లు, ఆ రెంటి మధ్య భవిష్యత్ ఘర్షణ బహుశా వారి ఊహాగాన సృష్టిత అవాస్తవం ” అని విజయశాంతి చెప్పుకొచ్చారు.
కొన్ని రోజులుగా విజయశాంతి చేస్తోన్న ట్వీట్లు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆమె ట్వీట్ చేశారు.
ఆ కార్యక్రమం నుంచి మధ్యలో ఎందుకు వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడిగారని, తెలంగాణను వ్యతిరేకించి, తెలంగాణ వాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉంటే అక్కడ ఉండటం తనకు అసౌకర్యం, అసాధ్యమని చెప్పారు. అందుకే ఆ కార్యక్రమం నుంచి ముందుగానే వెళ్లవలసి వచ్చిందని చెప్పారు. దీంతో విజయశాంతి పార్టీ మారతారా? అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. వీటికే తాజా ట్వీట్ తో ఆమె స్పష్టత ఇచ్చారు.
TSRTC Workers Bandh : ఆర్టీసీ కార్మికుల జంగ్ సైరన్.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు