Telangana Assembly Election 2023 : వీవీ ప్యాట్ యంత్రంలో మీరు వేసిన ఓటు చూసుకోవచ్చు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7.00గంటలకు ప్రారంభమైంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3.26 కోట్ల మంది ఓటర్లు పోలింగ్ పర్వంలో పాల్గొననున్నారు. ఓటరు ఈవీఎంలో ఓటు వేశాక ఓటు పడిందా లేదా అనేది వీవీప్యాట్ యంత్రంలో చూడవచ్చు....

Telangana Assembly Election 2023 : వీవీ ప్యాట్ యంత్రంలో మీరు వేసిన ఓటు చూసుకోవచ్చు

EVM, VV PAT machine

Updated On : November 30, 2023 / 7:52 AM IST

Telangana Assembly Election 2023 : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7.00గంటలకు ప్రారంభమైంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3.26 కోట్ల మంది ఓటర్లు పోలింగ్ పర్వంలో పాల్గొననున్నారు. ఓటరు ఈవీఎంలో ఓటు వేశాక ఓటు పడిందా లేదా అనేది వీవీప్యాట్ యంత్రంలో చూడవచ్చు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగానే ఓటరు ముందుగా తన పోలింగ్ స్లిప్సు ఓ పోలింగ్ అసిస్టెంటుకు చూపించాలి.

ALSO READ : Telangana Assembly Election 2023 : ఏడు గంటలకే పోలింగ్ షురూ .. రాష్ట్ర వ్యాప్తగా మొరాయిస్తున్న ఈవీఎంలు

మొదటి అధికారి ఓటర్ల జాబితాలో మీరు పేరును పరిశీలించి అన్నీ సరిగ్గా ఉంటే రెండో అధికారి వద్దకు పంపుతారు. పేరును పరిశీలించిన పోలింగ్ అధికారి ఓటరు సీరియల్ నంబరు, పేరును పైకి చదివి వినిపిస్తారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న పోలింగ్ అధికారితోపాటు పార్టీల ఏజెంట్లు ఆ నంబరు వద్ద టిక్కు పెట్టుకుంటారు. ఆ తర్వాత ఉన్న మరో పోలింగ్ అసిస్టెంట్ ఓటరు కార్డు లేదా ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డును చూపించి స్లిప్పు పొందాలి.

ALSO READ : Telangana Assembly Election 2023 : తెలంగాణ పోలింగ్ నేపథ్యంలో ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లో నిఘా ముమ్మరం

రెండో అధికారి ఓటరు ఎడమ చేతి వేలికి ఇంక్ మార్కు పెడతారు. ఆ స్లిప్పును ఈవీఎం కంట్రోల్ యూనిట్ పోలింగ్ అధికారికి ఇస్తే ఈవీఎంలో ఓటు వచ్చేలా చేస్తారు. అనంతరం రహస్యంగా పక్కన ఏర్పాటు చేసిన ఈవీఎం వద్దకు పంపిస్తారు. అక్కడ ఈవీఎంలో నచ్చిన పార్టీకి, అభ్యర్థికి ఎదురుగా బటన్ నొక్కాలి. అప్పుడు బీప్ అని పెద్ద శబ్ధం వస్తోంది.అనంతరం ఈవీఎం పక్కన ఏర్పాటు చేసిన వీవీప్యాట్ యంత్రంలో మీరు ఎవరికి ఓటు వేశారనేది పది సెకండ్లపాటు కనిపిస్తోంది. మీరు ఎవరికి ఓటు వేస్తే వారి పేరు గుర్తు వీవీప్యాట్ లో దర్శనమిస్తుంది. దీంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తి అవుతోంది.