Bandi Sanjay : ఒవైసీ ఆశీస్సులతో నన్ను ఓడించాలనుకుంటున్నారు- బండి సంజయ్
యువకులారా.. మళ్లీ రబ్బర్ చెప్పులు, జీన్స్ ప్యాంట్ సత్తా చూపండి. సీఎం పదవిని చెప్పుతో సమానమన్న కేసీఆర్ కు బుద్ది చెప్పండి. Bandi Sanjay
Bandi Sanjay Slams KCR (Photo : Facebook)
Bandi Sanjay Slams KCR : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. నేను బరిలో దిగుతానంటే వాళ్ల గుండెల్లో డప్పులు మోగుతున్నాయి అని బండి సంజయ్ అన్నారు. దారుస్సలాం పోయి పచ్చ టోపీలు పెట్టుకుని ఒవైసీ ఆశీస్సులతో నన్ను ఓడించాలనుకుంటున్నారు అని బండి సంజయ్ చెప్పారు.
ప్రలోభాలు, డ్రగ్స్ ఆశ చూపి యువకులను లోబర్చుకునేందుకు యత్నిస్తున్నారు అని ఆరోపించారు. యువకులారా.. మళ్లీ రబ్బర్ చెప్పులు, జీన్స్ ప్యాంట్ సత్తా చూపండి. సీఎం పదవిని చెప్పుతో సమానమన్న కేసీఆర్ కు బుద్ది చెప్పండి అని పిలుపునిచ్చారు బండి సంజయ్.
