Revanth Reddy : ప్రేమ విఫలమై చనిపోయిందని ఎలా చెబుతారు.. ప్రవళిక విషయంలో ప్రెస్ మీట్ పెట్టిన డీసీపీపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం : రేవంత్ రెడ్డి
అమ్మాయి ఫోన్ సీజ్ చేస్తే సమాచారం ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. ఫోన్ ఓపెన్ చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్నారు.

TPCC Chief Revanth Reddy (2)
TPCC Chief Revanth Reddy : నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబం పరువును మంటగలిపేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రేమ విఫలమై చనిపోయిందని పోలీసు అధికారి ఎలా చెబుతారని నిలదీశారు. నిర్భయ చట్టాన్ని ఉల్లంఘించి వివరాలు ఎలా బయటపెడతారని ప్రశ్నించారు. కోర్టు అనుమతితో ఆధారాలు తీసుకున్నాకే వివరాలు వెల్లడించాల్సివుంది కానీ, అవేవీ చేయలేదన్నారు. తాను ప్రశ్నిస్తే ప్రెస్ మీట్ పెట్టిన అధికారిని కాకుండా వేరే అధికారిని సస్పెండ్ చేశారని తెలిపారు.
ప్రవళిక విషయంలో ప్రెస్ మీట్ పెట్టిన డీసీపీపై కేసు పెడతామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి పత్రికా ప్రకటన చేసిన డీసీపీపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అమ్మాయి ఫోన్ సీజ్ చేస్తే సమాచారం ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. ఫోన్ ఓపెన్ చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్నారు. ఫోన్ సమాచారం ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రాక ముందే డీసీపీ ప్రెస్ మీట్ ఎలా పెడతారని నిలదీశారు. డీసీపీపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
Revanth Reddy : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. తొలి ఉద్యోగం రజినీకి ఇస్తాం : రేవంత్ రెడ్డి
బీజేపీ, బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు
హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ పదే పదే కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. డబ్బులు, మందు పంచి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని వాళ్లు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బు, లిక్కర్ పంచి ఎన్నికల్లో గెలవాలని చూశారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ పోటీ పడి ఉప ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయని విమర్శించారు. నెలరోజుల్లో రూ.60 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే మునుగోడు ఉప ఎన్నిక జరిగిన 30 రోజుల్లో రూ.300 కోట్ల మద్యం అమ్మారని తెలిపారు.
మునుగోడులో కాంగ్రెస్ చుక్క మందు, డబ్బు పంచలేదన్నారు. అందుకే తమపై ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ కు తాను సూటిగా సవాల్ చేశానని చెప్పారు. చుక్క మందు, డబ్బు పంచకుండా ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరానని తెలిపారు. అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ప్రమాణం చేద్దామని ఆహ్వానించానని పేర్కొన్నారు. కేసీఆర్ రాకపోగా.. అమరుల స్థూపం వద్దకు వెళ్లిన తనను అరెస్టు చేస్తారా అని మండిపడ్డారు. ముందస్తు అనుమతి పేరుతో పోలీసులు నిర్బంధించారని తెలిపారు. తమ కార్యకర్తలపై దాడులు చేశారని వెల్లడించారు.
Ponguleti Srinivas Reddy : బీఆర్ఎస్ ఎన్ని డ్రామాలు చేసినా అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే : పొంగులేటి
నీళ్లు, నిధులు, నియామకాలను కుటుంబానికే పరిమితం చేసిన కేసీఆర్
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతోనే ఎన్నికలకు వెళుతుందన్నారు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోరుకున్నారని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలను కేసీఆర్ తన కుటుంబానికే పరిమితం చేశారని విమర్శించారు. తాము విసిరిన సవాల్ స్వీకటించకపోవడంతో కేసీఆర్ ఎన్నికల్లో డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని స్పష్టత వచ్చిందన్నారు.
రిటైర్డ్ అయిన అధికారులను ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోందని ప్రశ్నించారు. వారిని ప్రయివేట్ సైన్యంగా చేసుకుని కేసీఆర్ తమపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. నిన్న గన్ పార్క్ వద్ద నిరసనలు చేసినవారికి నిబంధనలు వర్తించవా? అని నిలదీశారు. కాంగ్రెస్ ను తిట్టి ధర్నా చేసే వారికి రిటర్నింగ్ అధికారి అనుమతి అవసరం లేదా? అని ప్రశ్నించారు.
Kamareddy: కేసీఆర్ రాకతో షబ్బీర్ అలీ వెనకడుగు.. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?
తాము ఇచ్చిన హామీలలో అన్నింటినీ రెట్టింపు చేసి కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టారని ఎద్దేవా చేశారు. మరి తాము 2లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పామని కానీ, కేసీఆర్ ఉద్యోగ నియామకాల ఊసే ఎత్తలేదన్నారు. ప్రవళిక కుటుంబ సభ్యులను బుధవారం రాహుల్ గాంధీ వద్దకు తీసుకెళ్లాలనుకుంటే… బీఆర్ఎస్ నేతలను పంపి ఆ కుటుంబాన్ని ప్రగతి భవన్ లో బంధిస్తారట అని అన్నారు.
ఆడబిడ్డ కుటుంబాన్ని అవమానించిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి..
కేసీఆర్ ఇంతటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ యువకులారా మీ శక్తిని తక్కువ అంచనా వేయకండి అన్నారు. 30లక్షల నిరుద్యోగ యువకులారా… ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నా… ఈ 45 రోజులు ప్రతీ నిరుద్యోగ యువకుడు ముందుకొచ్చి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొట్టాలి అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడుతామని తెలిపారు.
ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందన్నారు. ఒక ఆడబిడ్డ కుటుంబాన్ని అవమానించేలా వ్యవహరించిన ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. నిరుద్యోగ యువకులారా సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేయాలని సూచించారు. కాంగ్రెస్ లీగల్ విభాగం వారికి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.