“ఇక నేనే రంగంలోకి దిగుతా.. డైరీల్లో రాసిపెట్టుకోండి” అంటూ కేసీఆర్ వార్నింగ్
ఇది ఆపడం ఎవరి తరం కాదని చెప్పారు.

హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పోలీసులకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారని, సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారని కేసీఆర్ అన్నారు.
“ప్రజలకు ఆ హక్కు లేదా. నా మనసుకు బాధైతోంది. నా మనసు కాలుతోంది. ప్రజలపై కేసులు పెడుతున్న పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. ఆపడం ఎవరితరం కాదు. పోలీసులకు రాజకీయాలు ఎందుకు? కార్యకర్తలకు బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా ఉంటుంది. ఇకపై నేను బయటికి వస్తా.. అందరి తరఫున పోరాడతా..
గ్యారంటీగా పోలీసు మిత్రులారా ఇవాళ రాత్రి ఇంటికి పోయి డైరీల్లో రాసిపెట్టుకోండి. తెలంగాణలో నెలకొన్న ఈ పరిస్థితి వల్ల మళ్లీ 100 శాతం అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇది ఆపడం ఎవరి తరం కాదు. పోలీసులు ఉద్యోగాలు చేస్తున్నారు మీకు తెలియదా. కాంగ్రెస్ వాళ్లు మోసం చేయలేదా? ప్రజలు నిలదీస్తుంటే మీరెందుకు కేసులు పెడుతున్నారు?” అని కేసీఆర్ అన్నారు.