బస్సు నుంచి జారిపడ్డ లక్ష రూపాయలు.. వెంటనే తీసుకుని వెనక్కి తిరగకుండా నడుచుకుంటూ వెళ్లిపోయిన మహిళ

Viral Video: నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట ఆర్టీసీ బస్సు డిపో వద్ద ఓ మహిళకు లక్ష రూపాయలు దొరికాయి.

బస్సు నుంచి జారిపడ్డ లక్ష రూపాయలు.. వెంటనే తీసుకుని వెనక్కి తిరగకుండా నడుచుకుంటూ వెళ్లిపోయిన మహిళ

నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట ఆర్టీసీ బస్సు డిపో వద్ద ఓ మహిళకు లక్ష రూపాయలు దొరికాయి. ఆ డబ్బు ఎవరిదో అడిగి వారికి ఇచ్చేయకుండా వేగంగా నడుస్తూ వెళ్లిపోయింది ఆ మహిళ. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమల్లో వైరల్ అవుతున్నాయి.

వీడియోలో కనపడుతున్న దృశ్యాల ప్రకారం.. ఒక వ్యక్తి బస్సు దిగుతుండగా అతడి నుంచి రూ.లక్ష జారి కింద పడిపోయింది. దీంతో ఓ మహిళ ఆ డబ్బులు చూసి, వెంటనే తీసుకుని వెనక్కి తిరగకుండా నడుచుకుంటూ వెళ్లిపోయింది.

బాధితులు అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బస్టాండ్ లోని సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. ఆ డబ్బును ఒక మహిళ తీసుకెళ్లినట్టు నిర్ధారణకు వచ్చారు. ఆ మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సీసీటీవీ ఫుటేజ్

అచ్చంపేట బస్టాండులో బస్సులో నుండి జారిపడ్డ లక్ష రూపాయలు.. వెంటనే గమనించి ఆ డబ్బులు తీసుకొని వెళ్లిపోయిన మహిళ.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళ కోసం గాలిస్తున్న పోలీసులు. pic.twitter.com/OKEYKWj5DN

— Telugu Scribe (@TeluguScribe) February 12, 2024