Hayat Nagar : హయత్ నగర్ లో మహిళ మృతదేహం కలకలం
హైదరాబాద్ లోని హయత్‌నగర్ లో మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న బాతల చెరువు సమీపంలో ఇద్దరు యువకులు మహిళ మృతదేహాన్ని బ్లాంకెట్‌లో చుట్టి తరలిస్తుండగా స్థానికులు గమనించారు.

Woman Dead
Woman’s dead body : హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్ లో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న బాతల చెరువు సమీపంలో ఇద్దరు యువకులు ఓ మహిళ మృతదేహాన్ని బ్లాంకెట్‌లో చుట్టి తరలిస్తుండగా.. స్థానికంగా ఉన్న యువకులు గమనించారు. మృతదేహం ఎవరిది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అని ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అప్పగించారు.
ఆ ఇద్దరు యువకులు మహిళను హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతురాలు తన భార్య అని.. తాము లవ్ మ్యారేజ్ చేసుకున్నామని ఇద్దరిలో ఒకరైన వినోద్ అనే యువకుడు చెబుతున్నాడు. అయితే ఆమె ఎలా చనిపోయిందన్నదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.
Wife Killed By Husband : భర్తను కొట్టి చంపిన భార్య
అయితే మృతురాలి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగింది? ఆ మహిళ ఎవరు? అన్న దానిపై విచారణ జరుపుతున్నారు.