Hyderabad Crime : పాతబస్తీలో దారుణ హత్య

హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య కలకలం రేపింది. సౌత్ జోన్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో శ్యామా టాకీస్ సమీపంలో ఓ యువకుడిని దారుణంగా హత్యచేశారు.

Hyderabad Crime : పాతబస్తీలో దారుణ హత్య

Hyderabad Crime (5)

Updated On : November 14, 2021 / 6:40 AM IST

Hyderabad Crime : హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య కలకలం రేపింది. సౌత్ జోన్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో శ్యామా టాకీస్ సమీపంలో ఓ యువకుడిని దారుణంగా హత్యచేశారు. ఆరిఫ్ అనే యువకుడిని వెంటాడి వేటాడి కత్తులతో నరికి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది.

చదవండి : Hyd Crime : హైదరాబాద్‌లో దారుణం.. ప్రేమకు అడ్డుచెప్పిన తండ్రి.. హత్యచేసిన బాలిక

సమాచారం అందుకున్న పోలీసులు పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు.

చదవండి : Cyber Crime : ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది..పెళ్లి చేసుకుంటానంది, రూ. 95 లక్షలు కొట్టేసింది