ఆన్‌లైన్‌ గేమ్స్‌లో నష్టపోయి అప్పులపాలు.. సెల్ఫీ వీడియో తీసుకొని యువకుడి ఆత్మహత్య

  • Published By: bheemraj ,Published On : November 27, 2020 / 06:33 PM IST
ఆన్‌లైన్‌ గేమ్స్‌లో నష్టపోయి అప్పులపాలు.. సెల్ఫీ వీడియో తీసుకొని యువకుడి ఆత్మహత్య

Updated On : November 27, 2020 / 6:38 PM IST

Young man commits suicide : ఆన్‌లైన్‌ గేమ్స్‌కు మరో నిండు ప్రాణం బలైపోయింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌లో నష్టపోయి అప్పులపాలయ్యాడు. మనస్తాపంతో సెల్ఫీ వీడియో తీసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాధ ఘటన హైదరాబాద్ వనస్థలిపురంలో చోటుచేసుకుంది.



హైదరాబాద్‌ వనస్థలిపురానికి చెందిన జగదీష్ ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి భారీగా నష్టపోయాడు. దీంతో మనస్తాపం చెందిన జగదీష్‌ అప్పు తీర్చలేక.. ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. నన్ను క్షమించండి అంటూ తండ్రి, భార్యకు సెల్ఫీ వీడియో పంపి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.



అయితే గతంలోనే జగదీష్‌ అప్పులు చేసి ఇబ్బందుల్లో ఉండగా.. అతడి తండ్రి రూ.12 లక్షలు అప్పు తీర్చాడు. మిగతా అప్పు తీర్చేందుకు మరోసారి ఆన్‌లైన్‌ గేమ్ ఆడి ఆర్థికంగా మరింత నష్టపోయాడు జగదీష్‌. దీంతో నన్ను క్షమించండి అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.