YS Sharmila: వైఎస్సార్టీపీ 119 నియోజక వర్గాల్లోనూ పోటీ.. నేను 2 స్థానాల్లో పోటీ చేయాలని..: షర్మిల సంచలన ప్రకటన

బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా పోటీ చేయాలన్ని డిమాండ్ ఉందని అన్నారు. అవసరమైతే వారిద్దరూ పోటీ చేస్తారని ప్రకటించారు.

YS Sharmila: వైఎస్సార్టీపీ 119 నియోజక వర్గాల్లోనూ పోటీ.. నేను 2 స్థానాల్లో పోటీ చేయాలని..: షర్మిల సంచలన ప్రకటన

YS-Sharmila

Updated On : October 12, 2023 / 4:28 PM IST

YSRTP: తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ 119 నియోజక వర్గాల్లోనూ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రకటించారు. బీఫాంల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. షర్మిల అధ్యక్షతన ఇవాళ వైఎస్సార్టీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల చెప్పారు. తాను రెండు నియోజక వర్గాల్లో పోటీ చేయాలని డిమాండ్ ఉందని తెలిపారు. బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా పోటీ చేయాలన్ని డిమాండ్ ఉందని అన్నారు. అవసరమైతే వారిద్దరూ పోటీ చేస్తారని ప్రకటించారు.

కాంగ్రెస్‌తో కలిసి వెళ్తే ప్రజా వ్యతిరేక ఓటు చీలదని అనుకున్నామని చెప్పారు. ఓట్లు చీల్చితే తమకు అపఖ్యాతి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆలోచించామని తెలిపారు. ఓట్ల చీలకూడదని కాంగ్రెస్‌తో చర్చలు జరిపామని అన్నారు. నాలుగు నెలల పాటు ఎదురు చూశామని చెప్పారు. తెలంగాణలో మళ్లీ వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు వస్తామని చెప్పుకొచ్చారు.

కాగా, తెలంగాణలో నవంబరు 30న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఫలితాలు వెల్లడవుతాయి. కాంగ్రెస్ తో కలిసి ప్రొ.కోదండరామ్ పార్టీ టీజేఎస్ పోటీ చేయనుంది. కాంగ్రెస్ తో విలీనం/పొత్తు కుదరకపోవడంతో వైఎస్సార్టీపీ మళ్లీ తమ పార్టీని బలపర్చుకునే పనిలో నిమగ్నమవుతోంది.

KA Paul: 119 మంది అభ్యర్థులను ప్రకటిస్తా.. సర్వేలు అన్నీ ఓ విషయాన్ని చెబుతున్నాయి: కేఏ పాల్