Ys Sharmila: కుంభకర్ణుడి అసలైన వారసులు మీరు: వైఎస్ షర్మిల

ఎన్నికలకు మూడు నెలల ముందు దుమ్ము దులిపి, నలుగురికి మమా అనిపించి..

Ys Sharmila: కుంభకర్ణుడి అసలైన వారసులు మీరు: వైఎస్ షర్మిల

YS Sharmila

Ys Sharmila – KTR: తెలంగాణ (Telangana) మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్టీపీ (YSRTP) అధినేత్రి షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందే ప్రజలు గుర్తుకువస్తారా? అని నిలదీశారు. బీఆర్ఎస్ పథకాలు, నేతలు అంతా బోగస్ అని ట్వీట్ చేశారు.

” సంక్రాంతి గంగిరెద్దులతో ప్రతిపక్షాలను పోల్చే చిన్న దొర.. ఎన్నికల ముందు నిద్ర లేచిన కుంభకర్ణుడి అసలైన వారసులే మీరు. ఎన్నికల ముందే ప్రజలు గుర్తుకొస్తారు. మీరు నిద్రలేస్తారు.. పథకాలను నిద్ర లేపుతారు. కొత్త కొత్త స్కీంలంటూ పిట్ట కథలు చెప్తారు. మాయమాటలతో మాయాజాలం చేస్తారు. పప్పులుడకవని తెలిస్తే సెంటిమెంట్ ను రాజేస్తారు.

అభివృద్ధి తప్ప అన్ని విద్యలు ప్రదర్శిస్తారు.నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మళ్లీ జనంవైపు కన్నెత్తి కూడా చూడరు.. ప్రశ్నించే ప్రతిపక్షాలను అణగదొక్కడం, అరెస్టులు చేయడం ఇదే మీకు తెలిసిన విద్య. రెండు సార్లు ప్రజలు పట్టం కడితే పెట్టినవి పంగనామాలే తప్ప ఒక్క వర్గానికైనా మేలు జరగలే. 8 ఏళ్లలో ముష్టి 30 వేల ఇండ్లు కట్టిన మీరే దేశానికి ఆదర్శం అయితే.. 5 ఏళ్లలో 42 లక్షల పక్కా ఇండ్లు కట్టించిన వైయస్ఆర్ గారి పాలనను ఏమనాలి?

మహానేత కట్టించిన ఇండ్లలో ఒక్క శాతం కూడా కట్ట చేతకాని మీరు దద్దమ్మలు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన మోసగాళ్లు.పాలన చేతకాని అసమర్థులు మీరు. 2.90 లక్షల ఇండ్లు కడతామని చెప్పి లక్ష ఇండ్లు కూడా కట్టలే. అల్లుడు, ఆత్మగౌరవం అంటూ ఉన్న గుడిసెకు కూడా దిక్కులేదు. స్కీముల పేరుతో స్కాంలు చేసి లక్ష కోట్లు కాజేశారు.

బంగారు తునకను రూ.5 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు. ఇన్నేళ్లుగా పథకాలను అటకెక్కించి, ఎన్నికలకు మూడు నెలల ముందు దుమ్ము దులిపి, నలుగురికి మమా అనిపించి.. మరిన్ని కొత్త పథకాలు అని చెప్తే నమ్మే రోజులు లేవు కేటీఆర్ గారు. మీ పథకాలు, మీరు అంతా ఒక బోగస్ ” అని షర్మిల ట్వీట్ చేశారు.

YCP Leaders : చంద్రబాబుకి పట్టిన గతే లోకేష్ కి పడుతుంది.. తొడగొట్టిన బాలకృష్ణ తోకముడిచి పారిపోయాడు