G20 Summit 2023 : మోదీ, జోబిడెన్ ద్వైపాక్షిక సమావేశంలో ఏఐ, సైన్స్, డిఫెన్స్ అంశాలపై చర్చ

న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం రాత్రి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధాని మోదీ తన అధికారిక లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలో అధ్యక్షుడు బిడెన్‌కు ఆతిథ్యం ఇచ్చారు....

G20 Summit 2023 : మోదీ, జోబిడెన్ ద్వైపాక్షిక సమావేశంలో ఏఐ, సైన్స్, డిఫెన్స్ అంశాలపై చర్చ

PM Modi,Biden meet

Updated On : September 9, 2023 / 5:00 AM IST

G20 Summit 2023 : న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం రాత్రి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధాని మోదీ తన అధికారిక లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలో అధ్యక్షుడు బిడెన్‌కు ఆతిథ్యం ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తర్వాత రెండు నెలల తర్వాత అధ్యక్షుడు జో బిడెన్ సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరగనున్న జీ 20 నేతల సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం న్యూఢిల్లీ చేరుకున్నారు. (G20 Summit 2023)

G20 Summit: జీ20 సమావేశాల కోసం ఢిల్లీ చేరుకున్న అమెరికా అధినేత జో బైడెన్.. విమానాశ్రయంలో ఒక ఆసక్తికర దృశ్యం

2023 జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలను అమలు చేయడంలో గణనీయమైన పురోగతిని ప్రధాని మోదీ, అధ్యక్షుడు బిడెన్ ప్రశంసించారు. (PM Modi, President Biden) ద్వైపాక్షిక చర్చల తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటన ప్రకారం ఇద్దరు నేతలు భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

CM Bhupesh Baghel : ఢిల్లీ నో ఫ్లై జోన్‌ .. నేను ఎలా వెళ్లగలను..? : జీ20 డిన్నర్‌‌కు హాజరుకావటంపై సీఎం బఘేల్ వ్యాఖ్యలు

సాంకేతికత, రక్షణ నుంచి ఆరోగ్య సంరక్షణ, పునరుత్పాదక ఇంధనం (AI, science, defence) వరకు వివిధ రంగాల్లో విస్తరించి ఉన్న తమ దేశాల భాగస్వామ్యం కోసం ప్రధాని మోదీ యూఎస్ ప్రెసిడెంట్ బిడెన్ కు వివరించారు. ప్రెసిడెంట్ బిడెన్ భారతదేశం జీ 20 ప్రెసిడెన్సీని ప్రశంసించారు. న్యూఢిల్లీలో జరిగే జీ 20 లీడర్స్ సమ్మిట్ స్థిరమైన అభివృద్ధికి, అంతర్జాతీయ సహకారానికి దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. యూఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యునిగా భారతదేశానికి తన మద్ధతు ఇస్తానని అధ్యక్షుడు బిడెన్ పునరుద్ఘాటించారు. చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత అంతరిక్ష పరిశోధనలో భారతదేశం సాధించిన విజయాలను అధ్యక్షుడు బిడెన్ అభినందించారు.