COVID-19: ఏపీ స్కూళ్లలో మొదలైన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్లు తెరిచిన తొలి వారంలోనే కరోనా కేసులు రావడం మొదలైంది.

Ap Corona
COVID-19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్లు తెరిచిన తొలి వారంలోనే కరోనా కేసులు రావడం మొదలైంది. దీంతో పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో స్కూళ్లలో హాజరు శాతం తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. పెరుగుతున్న కేసుల కారణంగా హాజరు శాతం తగ్గినట్లుగా ఉపాధ్యాయులు భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఆందోళన లేదంటుంది. తల్లిదండ్రుల అంగీకారంతోనే విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారు.
లేటెస్ట్‌గా ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని డీఆర్ఎం మున్సిపల్ స్కూల్లో హెడ్ మాస్టర్ సహా ముగ్గురు టీచర్లు, విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. మరికొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నా కూడా.. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని ఓ పాఠశాలలో ఐదుగురు స్టూడెంట్స్‌కు కూడా వైరస్ సోకింది.
శ్రీకాళహస్తి రూరల్ మండలం, కాపుగున్నేరి పంచాయతీ పరిధిలోని ఎంఎంసీ కండ్రిగలోని ప్రాధమిక పాఠశాలల్లో ఐదుగురు విద్యార్థినులకు కరోనా సోకింది. తల్లిదండ్రులు ఇదే విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు తెరిచిన వారం రోజుల్లోనే పిల్లలకు వైరస్ సోకడంతో ప్రభుత్వం మరింత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు.