అందుకే.. పవన్‌ కల్యాణ్‌తో కలిసి పని చేయాలని నిర్ణయం- మాజీమంత్రి కొణతాల కీలక వ్యాఖ్యలు

ఈ ప్రభుత్వాన్ని అధికారం నుండి దించాలి. అన్ని పార్టీల నుండి నాకు ఆహ్వానం వచ్చింది. రాజశేఖర్ రెడ్డితో నాకు మంచి అనుబంధం ఉంది.

అందుకే.. పవన్‌ కల్యాణ్‌తో కలిసి పని చేయాలని నిర్ణయం- మాజీమంత్రి కొణతాల కీలక వ్యాఖ్యలు

Konathala Ramakrishna

Updated On : January 21, 2024 / 5:37 PM IST

Konathala Ramakrishna : రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లుగా మాజీమంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. అనకాపల్లిలో కార్యకర్తలు, అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన తన రాజకీయ భవిష్యత్తును ప్రకటించారు. అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానం వచ్చిందన్నారు.

దివంగత వైఎస్ఆర్ తో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ లో ఉంటే ఉద్యమం చేయవచ్చని, అయితే ఆ పార్టీ ఇప్పట్లో అధికారంలోకి రాకపోవచ్చని తెలిపారు. పవన్ కల్యాణ్ మాట మీద నిలబడే వ్యక్తి అని, ఆయన వ్యక్తిత్వం తనకు బాగా నచ్చిందని చెప్పారు కొణతాల.

Also Read : ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల.. సీఎం జగన్‌పై నిప్పులు

అనకాపల్లిలో పెంటకోట కన్వెన్షన్ హాల్ లో కొణతాల రామకృష్ణ అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీమంత్రి కొణతల రామకృష్ణ పాల్గొన్నారు. దీనికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సమావేశంలో రాజకీయ భవిష్యత్తు ప్రకటించారు కొణతాల.

”అన్ని పార్టీల నుండి నాకు ఆహ్వానం వచ్చింది. రాజశేఖర్ రెడ్డితో నాకు మంచి అనుబంధం ఉంది. కాంగ్రెస్ లో ఉంటే ఉద్యమం చేయచ్చు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో అధికారంలోకి రాకపోవచ్చు. పవన్ కల్యాణ్ మాట మీద నిలబడే వ్యక్తి. ఎటువంటి ఎజెండా లేని వ్యక్తి పవన్. అందుకే పవన్ కల్యాణ్ ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది.

Also Read : వైసీపీలో భారీగా మార్పులు చేర్పులు.. సీఎం జగన్ వ్యూహం ఏంటి? మరోసారి అధికారం దక్కేనా?

రాష్ట్ర ప్రయోజనల కోసం పవన్ తో కలిసి పని చేయాలి అనుకుంటున్నా. రాష్ట్రాభివృద్ధిపై ఆయనకు చిత్తశుద్ధి ఉంది. ఏపీని అభివృద్ధి చేయాలి. నిధులు రావాలి. రైల్వే జోన్, ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలు, ఇలా ఎన్నో అంశాలు చర్చించా. ఈ ప్రభుత్వాన్ని అధికారం నుండి దించాలి. ఒక్కటే నినాదం వినిపిస్తుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో నా ప్రయాణం ఉంటుంది” అని మాజీమంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. కొణతాల ప్రకటనతో.. పవన్ కల్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఆత్మీయ సమావేశంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.