ఇండియా-చైనా బోర్డర్‌లో ప్రశాంతం.. వెనక్కిపోతున్న బలగాలు

లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్(ఎల్ఏసీ) కంట్రోల్ వద్ద ఇండియా-చైనా బలగాల మధ్య వాదనలు తగ్గుముఖం పట్టాయి. ఇరు బలగాలు గాల్వాన్ ఏరియాలోని PP14వద్ద వెనుదిరగడం మొదలుపెట్టారు. హాట్ స్ప్రింగ్స్ సెక్టార్లు PP15, PP17Aవద్ద ఇలాంటి ఘటనే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఇరు బలగాలు గాల్వాన్ లోయ వద్ద వెనుదిరిగినట్లు వెల్లడించింది. ఐదురోజుల తర్వాత కమాండర్ స్థాయిలో చర్చలు జరగడంతో వివాదాలు సద్ధుమణిగాయి. ఇరువైపులా మ్యాన్ పవర్, యుద్దం చేసే ప్లాన్ లు ఆపేశారు. దాంతో పాటు వెరిఫికేషన్ ను కూడా జులై 5నుంచి ఆపేశారు.
చైనా వైపు నుంచి కొన్ని ప్రక్రియలు జరిగిన తర్వాత మొత్తానికి వాతావరణం సద్దుమణిగింది. ఆదివారం సాయంత్రానికి ప్రాంతం ఖాళీ చేయడంతో పాటు బలగాలు వెనక్కుతగ్గాయి. వారికి చెందిన వాహనాలు లొకేషన్ కు వచ్చి తమవాళ్లను తీసుకువెళ్లాయి. ఆర్మీ నుంచి కొద్ది పాయింట్లలో వెరిఫికేషన్ మొదలుపెట్టారు. రేపటికి పూర్తి వివరాలు తెలియనున్నాయని అధికారులు అంటున్నారు.
మూడు రోజుల డేటా ఆధారంగా వివరాలిలా ఉన్నాయి. ప్రోగ్రెస్ లేటుగానూ ఊహించని రీతిలో ఉండొచ్చని భావిస్తున్నారు. మనకు తెలుసు అది ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదని. కొద్ది రోజులుగా వాతావరణం బాగుండటం లేదు. గల్వాన్ వద్ద నదీ ప్రవాహం సరిగా లేదు. అదే ఉధృతిని అదుపు చేసిందని ఆయన అన్నారు.