Pawan Kalyan : ఫ్యూచర్ సూపర్ స్టార్ అఫ్ ఇండియా.. పవన్ కళ్యాణ్ అంటున్న హీరోయిన్..
తాజాగా ఒక స్టార్ హీరోయిన్ పవన్ ని 'ఫ్యూచర్ సూపర్ స్టార్ అఫ్ ఇండియా' అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..?

Star Heroine says Pawan Kalyan is the Future Super Star of India
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జనరల్ ఆడియన్స్ లో మాత్రమే కాదు, సినీ సెలబ్రిటీస్ లో కూడా అభిమానులు ఉంటారు. స్టార్ దర్శకులు, హీరోహీరోయిన్స్ కూడా పవన్ కి ఫ్యాన్స్ అని చెప్పుకుంటుంటారు. అంతేకాదు పవన్ గురించి గొప్పగా మాట్లాడుతూ వైరల్ అవుతుంటారు. తాజాగా ఒక స్టార్ హీరోయిన్ పవన్ ని ‘ఫ్యూచర్ సూపర్ స్టార్ అఫ్ ఇండియా’ అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..?
సౌత్ లాంగ్వేజ్స్ లోని పలు హిట్ మూవీస్ లో నటించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ ‘లైలా’ అందరికి గుర్తుకు ఉండే ఉంటారు. 2006 తరువాత మళ్ళీ సినిమాల్లో కనిపించని ఈ యాక్ట్రెస్ ఇటీవల కార్తీ ‘సర్దార్’ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు విజయ్ దళపతి68 లో కూడా ఈమె ఒక ముఖ్య పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇక మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్న ఈ యాక్ట్రెస్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.
ఈక్రమంలోనే తాజాగా ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా, అందులో విలేకరి లైలాని.. ‘ఫ్యూచర్ సూపర్ స్టార్ అఫ్ ఇండియా ఎవరని అనుకుంటున్నారు’ అని ప్రశ్నించారు. దానికి లైలా బదులిస్తూ.. “పవన్ కళ్యాణ్” అంటూ టక్కున చెప్పేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also read : Ram Charan : రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి.. నిజమేనా..?
Future SuperStar of INDIA @PawanKalyan ? pic.twitter.com/RifQLPtweJ
— ѕυииуραωαиιѕт ツ (@SunnyPawanist) November 16, 2023
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నారు. OG షూటింగ్ చివరి దశలో ఉంటే ఉస్తాద్ ఇంకా మొదటి దశలోనే ఉంది. ఇక వీరమల్లు అప్పుడెప్పుడో సగం పైగా షూటింగ్ పూర్తి చేసుకొని మిగతా సగం పూర్తి చేసుకోవడానికి కష్టాలు పడుతుంది. ప్రస్తుతం ఎన్నికల హడావుడి మొదలవ్వడంతో ఈ సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ పడింది.