Viral Video : మోదీ, షారుఖ్‌లేనా? సరిగ్గా చూసి చెప్పండి
ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్నది నిజంగా వాళ్లేనా? ఓసారి మీరు చెక్ చేయండి.

Viral Video
Viral Video : మనిషిని పోలిన మనిషి ఉండటం సహజం.. కొందరిని చూసినప్పుడు వాళ్లేనా? కాదా? అని కళ్లు నలుపుకుని మరీ చూస్తాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఉన్నది భారత ప్రధాని నరేంద్ర మోదీ.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌లేనా? ఆ వీడియో చూస్తే మీకూ డౌట్ వస్తుంది.
Video Viral : ప్రముఖ క్రికెటర్ ముంబయిలోని రోడ్‌సైడ్ బార్బర్ షాప్‌లో కటింగ్…వీడియో వైరల్
koimoi అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేరైన ఓ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీడియో ఓపెన్ చేయగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఒక వేడుకలో కూర్చుని ఏదో సీరియస్‌గా చర్చించుకుంటున్నట్లు కనిపిస్తుంది. కాస్త నెమ్మదిగా వారి ముఖాలు గమనించండి.. అప్పుడు వాళ్లెవరో అర్ధం అవుతుంది. అచ్చంగా మోదీ, షారుఖ్‌లా కనిపించిన వ్యక్తుల్ని చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Anushka Sharma Viral Post : భర్త కోహ్లీపై అనుష్కా శర్మ తాజా కామెంట్… వైరల్ అయిన సోషల్ మీడియా పోస్టు
మనిషిని పోలిన మనుషులు 7 గురు ఉంటారని అంటారు. వినడమే కానీ డైరెక్ట్‌గా చూసి ఉండకపోవచ్చు. సినిమాల్లో చూస్తూ ఉంటాం. రియల్ లైఫ్‌లో ఒక్కసారైనా మనల్ని పోలిన మనుష్యుల్ని చూడకపోతామా? అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొన్ని వెబ్ సైట్ల ద్వారా తమను పోలిన వ్యక్తులను చాలామంది కలుసుకున్నారట. సాంకేతికత ఎంతగానో ముందుకు వెళ్లిన ఈ కాలంలో మన పోలికలతో ఉండేవారిని కనిపెట్టడం అంత కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా సాయం కూడా ఉండనే ఉంది. ఈ వీడియో చూసిన వారెవరైనా నిజంగానే మోదీ, షారుఖ్‌లు అనుకుంటారు. ఇటీవలే దివంగత నటి సౌందర్య పోలికలతో కనిపించిన మలేషియా మహిళను చూసి చాలామంది ముచ్చటపడ్డారు. అంతేకాదు ఇండియా వస్తే ఆమెను కలవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
View this post on Instagram