Karun Nair-KLRahul : క‌న్నీళ్లు పెట్టుకున్న క‌రుణ్ నాయ‌ర్‌.. ఓదార్చిన కేఎల్ రాహుల్‌.. ఇక రిటైర్‌మెంటే త‌రువాయి..!

దాదాపు ఎనిమిదేళ్ల త‌రువాత టీమ్ఇండియా టెస్టు జ‌ట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన క‌రుణ్ నాయ‌ర్ ఆశించిన స్థాయిలో రాణించ‌లేక‌పోయాడు

Karun Nair-KLRahul : క‌న్నీళ్లు పెట్టుకున్న క‌రుణ్ నాయ‌ర్‌.. ఓదార్చిన కేఎల్ రాహుల్‌.. ఇక రిటైర్‌మెంటే త‌రువాయి..!

Viral pic KLRahul consoles Karun Nair after he breaks down

Updated On : July 25, 2025 / 2:03 PM IST

దాదాపు ఎనిమిదేళ్ల త‌రువాత టీమ్ఇండియా టెస్టు జ‌ట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన క‌రుణ్ నాయ‌ర్ ఆశించిన స్థాయిలో రాణించ‌లేక‌పోయాడు. వ‌రుస‌గా మూడు టెస్టు మ్యాచ్‌ల్లో అవ‌కాశం ఇచ్చిన‌ప్ప‌టికి ఘోరంగా విఫ‌లం అయ్యాడు. మొత్తంగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో నాయ‌ర్ కేవ‌లం 131 ప‌రుగులు మాత్ర‌మే సాధించాడు. దీంతో మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో అత‌డిపై వేటు ప‌డింది. అత‌డి స్థానంలో యువ ఆట‌గాడు సాయి సుద‌ర్శ‌న్ బ‌రిలోకి దిగాడు.

కాగా.. క‌రుణ్ నాయ‌ర్‌కు సంబంధించిన ఓ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ ఫోటోలో క‌రుణ్ నాయ‌ర్ బాధ‌ప‌డుతుండ‌గా అత‌డిని కేఎల్ రాహుల్ ఓదారుస్తున్న‌ట్లుగా ఉంది. దీంతో నాలుగో టెస్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతోనే క‌రుణ్ బాధ‌ప‌డుతున్నాడ‌ని, ఇక అత‌డు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌నున్నాడ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Yash Dayal : ఇబ్బందుల్లో ఆర్‌సీబీ పేస‌ర్ య‌శ్ ద‌యాల్‌.. అత‌డిపై ఫోక్సో కేసు..

అయితే.. వైర‌ల్ అవుతున్న ఫోటో మాంచెస్ట‌ర్ మ్యాచ్ సంద‌ర్భంగా తీసింది కాద‌ని, లార్డ్స్ టెస్టు స‌మ‌యంలో తీసిన‌ట్లుగా తెలుస్తోంది.

ఏదీ ఏమైన‌ప్ప‌టికి వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో క‌రుణ్ నాయ‌ర్ ఘోరంగా విఫ‌లం అయ్యాడు. అత‌డి స్థానంలో నాలుగో టెస్టులో బ‌రిలోకి దిగిన సాయి సుద‌ర్శ‌న్ తొలి ఇన్నింగ్స్‌లో 151 బంతుల‌ను ఎదుర్కొని 7 ఫోర్ల సాయంతో 61 ప‌రుగులు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ సాయి రాణిస్తే.. ఆఖ‌రి టెస్టు మ్యాచ్‌లోనూ క‌రుణ్ చోటు ద‌క్క‌డం క‌ష్ట‌మే.

ఇక నాలుగో టెస్టు మ్యాచ్ విషయానికి వ‌స్తే.. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 358 ప‌రుగులకు ఆలౌటైంది. అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 2 వికెట్ల న‌ష్టానికి 225 ప‌రుగులు చేసింది. ఓలీ పోప్ (20), జో రూట్ (11) లు క్రీజులో ఉన్నారు.

ENG vs IND : ఈ రోజు నేనేంటో చూపిస్తా.. నిన్న వికెట్ తీసినా నా బౌలింగ్ పై సంతృప్తిగా లేను : అన్షుల్ కాంబోజ్