Sehar Shinwari : భారత్ పై పాకిస్థాన్ నటి అక్కసు.. టీమ్ఇండియాని ఓడిస్తే మటన్ బిర్యానీ..
భారత జట్టు సాధించిన ఘన విజయాన్ని చూసి కొందరు పాకిస్థాన్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో భారత జట్టుపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు.

Sehar Shinwari
Pakistani actor Sehar Shinwari : వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అక్టోబర్ 14న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పై వరుసగా 8 విజయాలు సాధించిన రికార్డును నెలకొల్పింది. భారత జట్టు సాధించిన ఘన విజయాన్ని చూసి కొందరు పాకిస్థాన్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో భారత జట్టుపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఇక పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారీ అయితే బంఫర్ ఆఫర్లు ప్రకటిస్తోంది.
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు బంగ్లా క్రికెటర్లకు ఓ ఆఫర్ ఇచ్చింది. టీమ్ఇండియాను ఓడిస్తే తాను ఓ బంగ్లా క్రికెటర్‌తో కలిసి డేట్‌కు వెళ్తానని చెప్పింది. అయితే అమ్మడి కోరిక నెరవేరలేదు. దీంతో ఇప్పుడు న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీషమ్ ఓ ఆఫర్‌ని ఇచ్చింది. ‘నువ్వు గనుక భారత్‌ను ఓడిస్తే మేము(పాకిస్థానీయులం) తదుపరి ప్రధానిగా ఎన్నుకుంటాం.’ అని ఓ ట్వీట్ చేసింది.
Hey @JimmyNeesh if you defeat Indian team, We Pakistanis will elect you as our next Prime Minister ✌️❤️
— Sehar Shinwari (@SeharShinwari) October 21, 2023
అయితే.. న్యూజిలాండ్ తుది జట్టులో జిమ్మీ నీషమ్ కు స్థానం దక్కలేదు. అయినప్పటికీ వరుస ట్వీట్లు చేస్తోంది. కివీస్ చేతిలో భారత్ ఓడిపోతే.. అబ్దుల్లా షా ఘాజీ దర్గాలోని పేదలకు మటన్ బిర్యానీ పంచిపెడతానని మాటిచ్చింది.
If India loses today, I will distribute a caldron of mutton biryani among poors in Abdullah Shah Ghazi Dargah today. India must never win any matches ?
— Sehar Shinwari (@SeharShinwari) October 22, 2023
అంతేనా.. టీమ్ఇండియా ఏ మ్యాచ్‌లోనూ ఎప్పుడూ గెలవకూడదంటూ ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్లు వైరల్‌గా మారగా.. భారత అభిమానులు గట్టిగానే గడ్డి పెడుతున్నారు.