శిశువు కోసం ఆందోళన

  • Published By: madhu ,Published On : May 8, 2019 / 09:57 AM IST
శిశువు కోసం ఆందోళన

Updated On : May 8, 2019 / 9:57 AM IST

24 గంటలు గడిచిపోయాయి. శిశువు ఆచూకి తెలియడం లేదు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డ ఆచూకి చెప్పాలని..ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వహిందని వారు వెల్లడిస్తున్నారు. సంగారెడ్డి మాతాశిశు అస్పత్రి నుంచి మాయమైన శిశువు ఆచూకీ .. ఇంతవరకూ లభించకపోవడం ఉత్కంఠ రేపుతోంది. బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా శిశువు మాత్రం దొరకలేదు. తమ పాప తమ చేతికి అందిన తర్వాతే ఇక్కడ నుంచి కదులుతామని.. పాప తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ముందు పడిగాపులు కాస్తున్నారు.

అటు బాధితులకు న్యాయం చేయాలంటూ వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనకుదిగాయి. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. తమకు ఎవరూ ఏ విషయం చెప్పడం లేదని కుటుంబసభ్యులు తెలియచేస్తున్నారు. పది సంవత్సరాల తరువాత సంతానం కలిగిందని…అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఇలా జరిగిందని వాపోయారు. మాధవి..మల్లేష్.. పేర్లతో రెండు కుటుంబాలు వచ్చాయని వైద్యులు అంటున్నారని..అయితే ఒకే పేషెంట్ ఉన్నారని తెలిపారు. వేరే వారి చేతుల్లో పెట్టి వెళ్లిపోయారని ఆరోపించారు. 

ఏప్రిల్ 30 శుక్రవారం మాధవి డెలివరి కోసం భర్త మల్లేష్ తో కలిసి సంగారెడ్డిలోని మాతా శిశు సంక్షేమ ఆస్పత్రికి వచ్చింది. ఏప్రిల్ 30 వ తేదీన మాధవి ప్రసవించింది. తల్లిదండ్రుల పేర్లు నిర్ధారణ చేసుకోకుండా మే 7 మంగళవారం వేరే వారికి పాపను అప్పగించారు. పాప గురించి ఆయాను అడగగా ఎప్పుడో అప్పగించామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మాత్రం చేపట్టారు.