ఎమ్మార్వో సజీవదహనం ఘటన జరిగి 24రోజుల తర్వాత.. తెరుచుకున్న తహసీల్దార్ ఆఫీస్
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ఆఫీస్ తెరుచుకుంది. గురువారం(నవంబర్ 28,2019) ఆఫీస్ ఓపెన్ అయ్యింది. ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన జరిగిన 24

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ఆఫీస్ తెరుచుకుంది. గురువారం(నవంబర్ 28,2019) ఆఫీస్ ఓపెన్ అయ్యింది. ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన జరిగిన 24
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ఆఫీస్ తెరుచుకుంది. గురువారం(నవంబర్ 28,2019) ఆఫీస్ ఓపెన్ అయ్యింది. ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన జరిగిన 24 రోజుల తర్వాత ఇవాళే ఆఫీస్ ని ఓపెన్ చేశారు. కొత్త ఎమ్మార్వోగా వెంకట్ రెడ్డి చార్జ్ తీసుకున్నారు.
ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఓ భూ వివాదంలో సరేష్ అనే రైతు ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో విజయారెడ్డి స్పాట్ లోనే చనిపోయారు. నవంబర్ 4న ఈ ఘటన జరిగింది. మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడిన సురేష్.. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. ఎమ్మార్వోని కాపాడే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్, వాచ్ మెన్ లు కూడా మృతి చెందారు. ఈ ఘటన మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. విజయారెడ్డి ఘటన తర్వాత తహసీల్దార్ ఆఫీస్ ని మూసేశారు. ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. పోలీసులు ఆఫీస్ ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్రైమ్ సీన్ లో ఆధారాలు సేకరించారు. ముమ్మరంగా దర్యాఫ్తు చేశారు. 24 రోజుల తర్వాత ఇవాళ ఆఫీస్ ని రీఓపెన్ చేశారు.
ఎమ్మార్వో పై దాడిని ప్రత్యక్షంగా చూసిన కొందరు సిబ్బంది ఇంకా షాక్ లోనే ఉన్నారు. ఆ రోజు జరిగిన దారుణాన్ని తలుచుకుని ఉలిక్కిపడుతున్నారు. విజయారెడ్డి ఘటన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని రెవెన్యూ ఆఫీసుల్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. రెవెన్యూ ఉద్యోగుల తీరుతో విసిగిపోయిన కొందరు రైతులు పెట్రోల్ బాటిళ్లలో ఎమ్మార్వో ఆఫీసులకు వెళ్లారు. మా పని చేస్తారా లేక పెట్రోల్ పోసి చంపమంటారా అని బెదిరించడం కలకలం రేపింది. దీంతో కొందరు రెవెన్యూ ఉద్యోగులు ముందు జాగ్రత్తలు ఏర్పాటు చేసుకున్నారు. కొందరు ఆఫీస్ లో తాడు కడితే, మరికొందరు కిటికీలు ఏర్పాటు చేసుకున్నారు.