SVBC డైరెక్టర్ గా సీఎం జగన్ నియమించింది నన్ను కాదు : క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నటుడు

టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) డైరెక్టర్ గా సినీ పరిశ్రమకు చెందిన శ్రీనివాసరెడ్డిని జగన్ ప్రభుత్వం నియమించినట్టు వార్తలు వచ్చిన

  • Published By: veegamteam ,Published On : October 13, 2019 / 12:31 PM IST
SVBC డైరెక్టర్ గా సీఎం జగన్ నియమించింది నన్ను కాదు : క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నటుడు

Updated On : October 13, 2019 / 12:31 PM IST

టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) డైరెక్టర్ గా సినీ పరిశ్రమకు చెందిన శ్రీనివాసరెడ్డిని జగన్ ప్రభుత్వం నియమించినట్టు వార్తలు వచ్చిన

టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) డైరెక్టర్ గా సినీ పరిశ్రమకు చెందిన శ్రీనివాసరెడ్డిని జగన్ ప్రభుత్వం నియమించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై గందరగోళం నెలకొంది. శ్రీనివాసరెడ్డి పేరు కారణంగా కొందరు కన్ ఫ్యూజ్ అయ్యారు. అంతా నటుడు, కమెడియన్ శ్రీనివాసరెడ్డికి అభినందనలు తెలపడం మొదలు పెట్టారు. దీంతో శ్రీనివాసరెడ్డి షాక్ తిన్నారు. దీనిపై స్పందించారు. 

ఎస్వీబీసీ డైరెక్టర్‌ పదవిని ఇచ్చింది తనకు కాదని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎస్వీబీసీ డైరెక్టర్ పదవి ‘ఢమరుకం’ సినిమా దర్శకుడు శ్రీనివాసరెడ్డికి దక్కిందని క్లారిటీ ఇచ్చారు. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో.. చాలామంది తానే అని పొరబడ్డారని వివరించారు. వాస్తవానికి నటుడు శ్రీనివాసరెడ్డి తెలంగాణకు చెందినవారు. ఆయనది ఖమ్మం జిల్లా. దీంతో తెలంగాణకు చెందిన మరొకరికి సీఎం జగన్ ప్రాధాన్యం ఇచ్చారని వార్తలొచ్చాయి.

మీరనుకుంటున్న శ్రీనివాసరెడ్డి నేను కాదు.. ఆయన డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి అని క్లారిటీ ఇస్తూ.. తన ట్విట్టర్ ఖాతాలో కమెడియన్ శ్రీనివాసరెడ్డి ట్వీట్ చేశారు.

ప్రముఖ కమెడియన్, 30 ఇయర్స్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన వైసీపీ నేత పృథ్వీ రాజ్ ని సీఎం జగన్.. ఎస్వీబీసీ చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దర్శకుడు శ్రీనివాసరెడ్డిని డైరెక్టర్ గా నియమించినట్టు వార్తలు వస్తున్నాయి.